సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ నేతలను మభ్యపెట్టడానికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అవినీతి, అబద్ధాలను జాతీయ నేతలు ఎప్పుడో అర్ధం చేసుకున్నారని ఆయన అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై థర్డ్‌పార్టీ విచారణ కోరుతున్నామని ఈసందర్భంగా ఆయన తెలిపారు. తమ డిమాండ్స్‌కు జాతీయ నేతలు సీతారాం ఏచూరి, శరద్ యాదవ్, శరద్ పవార్ మద్దతు తెలిపారని వెల్లడించారు. థర్డ్‌పార్టీ విచారణ జరిగితే సుత్రాదారులు బయటకు వస్తారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై దాడిని ఖండిస్తూ జాతీయ నేతల మద్దతు కోసం వైఎస్సార్‌సీపీ నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.
వారితో న్యాయం జరగదు..
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపితే న్యాయం జరగదని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. హత్యాయత్నం వెనుక చంద్రబాబు పాత్రలేకపోతే జాతీయ నేతలను ఎందుకు కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. థర్డ్‌పార్టీ విచారణతోనే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
కుట్రను వివరించాం..
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంను సీతారం ఏచూరి, శరద్ యాదవ్, పవార్‌లకు వివరించామని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు. తమ డిమాండ్స్‌కు వారు మద్దతిచ్చారని తెలిపారు. థర్డ్‌పార్టీ విచారణపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయలన్న విషయం జాతీయ నేతలకు తెలుసని ఆపార్టీ మాజీ ఎంపీ మేకపాటి రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కోరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మేం కోరుతున్నది హత్యాయత్నంపై థర్డ్‌పార్టీ విచారణ మాత్రమేనని మిథున్‌రెడ్డి ప్రకటించారు. జాతీయ నేతలందరికీ చంద్రబాబు నైజం తెలుసని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment