
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అంతమొందించటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు ఆరోపించారు. ఆదివారం న్యూఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ అండతోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని అన్నారు.
హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు తెలిపారు. జగన్ హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు ఢిల్లీ వచ్చారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment