
ఓటుకు నోటుపై హైకోర్టులో పిల్
ఓటుకు నోటుకు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
హైదరాబాద్: ఓటుకు నోటుకు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇది ప్రజల సొమ్ముతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున సీబీఐ విచారణ జరిపించాలని ఆయన పిల్ లో పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడిన వైనాన్ని, ఫోన్ ట్యాపింగ్, పార్టీ ఫిరాయింపులపై విచారణ జరిపించాలని కోరారు.
సెక్షన్ -8పై భారత ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను ఇవ్వాలని పిల్ లో పీవీ కృష్ణయ్య పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలపై ఈసీతో విచారణ చేయించాలని పిల్ లో పేర్కొన్నారు.