
సాక్షి, హైదరాబాద్: బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించనిదే పంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలు చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరణ చేపట్టకపోవడంతో మెజారిటీ బీసీ కులాలకు రాజకీయ పదవుల్లో అవకాశాలు రావడం లేదని పిటిషన్‌లో ఆశయ్య పేర్కొన్నారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.