BC classification
-
ఆ రిజర్వేషన్లపై లోతుగా విచారిస్తాం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వర్గీకరించే వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ అంశాన్ని తేలుస్తామని తెలిపింది. బీసీల వర్గీకరణ అధికారాన్ని ఆర్డీవోలకు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూరి జస్టిస్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువా రం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీల వారీగా రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4)ను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎంబీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ బీసీలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి, వారికి విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ వెసులుబాటు కల్పిం చడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. -
‘మెజారిటీ బీసీలకు న్యాయం చేయండి’
సాక్షి, హైదరాబాద్: బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించనిదే పంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ అమలు చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరణ చేపట్టకపోవడంతో మెజారిటీ బీసీ కులాలకు రాజకీయ పదవుల్లో అవకాశాలు రావడం లేదని పిటిషన్లో ఆశయ్య పేర్కొన్నారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఎస్సీ వర్గీకరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్
విచారణకు స్వీకరణ కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలోని జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం, ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలై న పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ఆదేశించారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. బీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ చేయక పోవడం వివక్ష చూపడమేనని, అందువల్ల ఎస్సీ వర్గీకరణకు 2008లో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, 1999లో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్లు ఇచ్చిన నివేదికలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సేవా సమితి సంయుక్త కార్యదర్శి రాయవరపు చిరంజీవరావు, మాదిగ రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వ రరావులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మంగళ వారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అశోక్ అనందకుమార్ వాదనలు వినిపిస్తూ.. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం సెక్షన్ 3(4) కింద కమిషన్ నివేదికలు సమర్పించిన 6 నెలల్లోపు వాటిని పార్లమెంట్ ఉభయ సభల ముందుం చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ నివేదికను అమలు చేసేందుకు కేంద్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించా రు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అవసరమని, జస్టిస్ ఉషా మెహ్రా, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ల నివేదికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివా దులుగా ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శి, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే.. పార్లమెంట్ గోడలు బద్దలు కొడతాం: ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
చేవెళ్ల: ‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి.. లేదంటే పార్లమెంటు గోడలను బద్దలు కొడతాం’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా బీసీలు అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కినప్పుడే బాగుపడతారని చెప్పారు. ‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నాం. ఉద్యమాలు చేస్తున్నాం. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని కోరితే 36 పార్టీలున్న పార్లమెంటులో ఏ రాజకీయ పార్టీ కూడా నోరు మెదపడం లేదు’ అని ఆరోపించారు. అవసరమైతే హక్కుల కోసం రాజస్తాన్‌లో గుజ్జర్లు చేసినట్లు పోరాటం చేస్తామని హెచ్చరించారు