సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా వర్గీకరించే వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ అంశాన్ని తేలుస్తామని తెలిపింది. బీసీల వర్గీకరణ అధికారాన్ని ఆర్డీవోలకు ఎలా ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూరి జస్టిస్ బి.రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువా రం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీల వారీగా రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4)ను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎంబీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు లాయర్ ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ బీసీలను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి, వారికి విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారని తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఈ వెసులుబాటు కల్పిం చడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment