
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో అవకతవకలపై ప్రజాధన పరిరక్షణ సమితికి చెందిన రామరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
రూ.370 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ఎంపికలో అక్రమాలు జరిగాయని, నకిలీ పత్రాలు సృష్టించి.. ధనుష్ సంస్థకు టెండర్ అప్పగించారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, ధనుష్ సంస్థ, ఏపీఎంఎస్‌డీసీ తదితరులను వివరణ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment