poonam malakondaiah
-
పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. పోరంకి ఎం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలో వరుడు శ్రీధర్, వధువు అహల్యలను సీఎం ఆశీర్వదించారు. -
AP: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఆయన కార్యదర్శులు కె. ధనుంజయ్ రెడ్డి, రేవు ముత్యాలరాజు, అదనపు కార్యదర్శి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా కూడ ఉన్నారు. చదవండి: Sujana : మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు -
స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను బేఖాతరు చేయడంపై మండిపడింది. ఓ దశలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసేందుకు సైతం హైకోర్టు సిద్ధమైంది. శాసనసభ సమావేశాల వల్ల అత్యవసర పని ఉండటంతో కోర్టు ముందు పూనం మాలకొండయ్య హాజరుకాలేకపోయారని, తదుపరి విచారణకు తప్పక హాజరవుతారని ప్రభుత్వ న్యాయవాది నివేదించడంతో హైకోర్టు మెత్తబడింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తనకు కొన్నేళ్లుగా జీతం చెల్లించకపోవడంపై విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.సుజాత 2018లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం అప్పటి వైద్య విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వైద్య విద్య అప్పటి డైరెక్టర్ బాబ్జీ, ప్రభుత్వ దంత వైద్య కళాశాల అప్పటి ప్రిన్సిపల్ మురళీమోహన్లను స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మురళీమోహన్ ఒక్కరే శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యారు. పూనం మాలకొండయ్య, బాబ్జీ హాజరు కాలేదు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ బాబ్జీ పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు హైకోర్టు జారీ చేసిన నోటీసే అందలేదన్నారు. తదుపరి విచారణకు ఆయన కూడా హాజరవుతారని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషనర్‌కు జీతం చెల్లించాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని అధికారులను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలంటే లెక్క లేదా? అంటూ నిలదీసింది. జీతం చెల్లించండి.. అంటూ మిమ్మల్ని యాచించాలా? 2018 నుంచి పిటిషనర్‌కు జీతం చెల్లించకుంటే బతికేది ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. ఈ వ్యవహారంలో అవసరమైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు అకౌంటెంట్ జనరల్ హాజరుకు ఆదేశాలిస్తామంది. -
సీఎం జగన్‌ను కలిసిన సమీర్ శర్మ, పూనం మాలకొండయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమీర్ శర్మకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా, చీప్ ఎగ్జిక్యూటివ్ టూ చీఫ్ మినిస్టర్‌గానూ.. డాక్టర్ పూనం మాలకొండయ్యకు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పగించింది. చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!) -
మార్కెట్లోకి 10 నూతన వంగడాలు
సాక్షి, అమరావతి: రైతులకు కొత్తగా మరో పది వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న వివిధ పరిశోధన కేంద్రాలు వీటిని అభివృద్ధి చేశాయి. వరిలో మూడు, పెసలు, చిరుధాన్యాల్లో రెండు చొప్పున విత్తనాలు వచ్చాయి. మినుము, వేరుశనగ, శనగలో ఒక్కొక్కటి చొప్పున కొత్త వంగడాలు తీసుకొచ్చారు. మంగళవారం రాష్ట్ర విత్తన సబ్ కమిటీ 40వ సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి వీటిని విడుదల చేశారు. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మంచి గుణగణాలు కలిగిన కొత్త రకాలను శాస్త్రవేత్తలు, విస్తరణ సిబ్బంది కలిసి రైతులకు పరిచయం చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిరుధాన్యాలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున, ఈ రకాల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త రకాల ప్రత్యేకతలను ఆర్బీకేల్లో ప్రద ర్శించి, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న తరుణంలో అందుకు అనువైన రకాలను రూపొందించాలని సూచించారు. కొత్త వంగడాల ప్రత్యేకతలు... ► వరి.. ఎంటీయూ–1318: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి విడుదల చేసిన ఈ రకం ఎంటీయూ 7029 స్వర్ణ రకానికి బదులుగా అభివృద్ధి చేసింది. మిషన్ కోతకు అనువైనది. ఎక్కువ దిగుబడినిస్తుంది. ముంపును తట్టుకునే శక్తి ఉంటుంది. ► వరి.. ఎంటీయూ1232: ఇది కూడా మార్టేరు పరి శోధన కేంద్రం అభివృద్ధి చేసిందే. నెల రోజుల ముంపును కూడా తట్టుకుంటుంది. 135 నుంచి 140 రోజుల్లో పంట వస్తుంది. అగ్గి, పాముపొడ తెగుళ్లు, సూది దోమను తట్టుకునే రకమిది. ► వరి.. ఎంసీఎం–103 (బందరు సన్నాలు): మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన వంగడమిది. ఉప్పు నేలలకు అనువైన రకమిది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సాధారణ నేలల్లో హెక్టార్‌కు 60 నుంచి 65 క్వింటాళ్లు, ఉప్పు నేలల్లో 50 నుంచి 55 క్వింటాళ్లు దిగుబడి ఇస్తుంది. ► రాగులు.. వీఆర్ 1099 (గోస్తనీ): దీన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన సంస్థ అభివృద్ధి చేసింది. అన్ని జిల్లాల్లో సాగుకు అనువైనది. ప్రస్తుతం ఉన్న శ్రీ చైతన్య రకం కంటే 17 నుంచి 22 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ► కొర్రలు.. ఎస్ఐఏ–3150 (మహానంది): దీన్ని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీతో పాటు వేసవి కాలానికి కూడా అనువైనది. హెక్టారుకు 31 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. 20 శాతం ఎక్కువ ప్రొటీన్, కాల్షియం ఉంటాయి. ► పెసర.. ఎల్జీజీ–574: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతానికి అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుం టుంది. హెక్టార్‌కు 15–16 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మిషన్ కోతకు అనువైనది. ► పెసర.. ఎల్జీజీ–607: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన రకమిది. పంట కాలం 60 నుంచి 65 రోజులు. యెల్లో మోజాయిక్ వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుంది. హెక్టార్‌కు 15–17 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఒకేసారి పరిపక్వతకు వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► మినుములు.. ఎల్బీజీ–884: గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైనది. మోజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టార్‌కు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ► శనగలు.. ఎన్‌బీఈజీ 776: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన రకమిది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హెక్టార్‌కు 28 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎక్కువ కాయలు కలిగి 20.9 శాతం ప్రొటీన్ ఉంటుంది. జేజీ–11 రకానికి బదులుగా సాగుకు అనువైనది. 90 నుంచి 105 రోజుల్లో పంట వస్తుంది. మిషన్ కోతకు అనువుగా ఉంటుంది. ► వేరుశనగ.. టీసీజీఎస్–1694: తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది. ఖరీఫ్, రబీ కాలాలకు అనువైన రకం. షెల్లింగ్ పర్సంటేజ్ 72 శాతంగా ఉంటుంది. ఖరఫ్లో హెక్టార్‌కు 35 క్వింటాళ్లు, రబీలో 50 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. -
ఏపీ మోడల్ తరహాలో దేశవ్యాప్తంగా ఈ–క్రాప్
ఈ–క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించి వివిధ పథకాల అమలు, నష్టపరిహారం పంపిణీ సులువుగా మారింది. ఏ ఊళ్లో.. ఎన్ని ఎకరాల్లో.. ఏయే పంటలు వేశారన్న కచ్చితమైన సమాచారం అందుబాటులోకి వస్తోంది. తద్వారా దిగుబడిపై ముందస్తుగా ఓ అంచనాకు రావచ్చు.. ఆయా పంటలకు మార్కెటింగ్ కల్పించే విషయమై సరికొత్త ఆలోచనలతో అడుగులు ముందుకు వేయొచ్చు. ఈ–క్రాప్ వల్ల ఇన్ని సౌలభ్యాలుండటం గమనించిన కేంద్రం.. ‘ఏపీ మోడల్ భేష్’ అంటూ జాతీయ స్థాయిలో అమలుకు శ్రీకారం చుడుతోంది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ–క్రాప్ నమోదు వల్ల రైతాంగానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం.. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఏపీని మోడల్‌గా తీసుకొని.. అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఎ) పేరిట అన్ని రాష్ట్రాల్లో ఈ– క్రాప్ నమోదు చేయాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా విజయవంతంగా అమలవుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు, రూ.లక్ష లోపు పంట రుణాలు ఏడాది లోపు చెల్లించిన వారికి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు. భూ యజమానులకే కాకుండా, సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు కూడా ఈ క్రాప్ నమోదే అర్హతగా వైఎస్సార్ రైతు భరోసాతో సహా అన్ని రకాల పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్ అమలులోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం, ఆక్వా పంటలన్నీ కలిపి ఖరీఫ్ 2020లో 124.92 లక్షల ఎకరాలు, రబీ 2020–21లో 83.77 లక్షల ఎకరాలు, ఖరీఫ్ 2021లో 112.26 లక్షల ఎకరాలు, రబీ 2021–22లో 82.59 లక్షల ఎకరాల్లో ఈ–క్రాప్ బుకింగ్ జరిగింది. ఏపీలో ఈ–పంట నమోదు ఇలా.. ► నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు ఈ –పంట నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా వాస్తవ సాగుదారులు సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్దతులు పాటిస్తూ సాగు చేస్తున్నారో ఆర్బీకేల్లో నమోదు చేస్తున్నారు. ► ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను అప్లోడ్ చేసి, చివరగా రైతుల సోషల్ స్టేటస్ తెలుసుకునేందుకు వీలుగా వారి వేలి ముద్రలు (ఈకేవైసీ – మీ పంట తెలుసుకోండి) తీసుకుని.. డిజిటల్ రసీదు వారి ఫోన్ నంబర్‌కు పంపిస్తున్నారు. ► ఈ పంట నమోదును వీఏఏ/వీహెచ్‌ఎ, వీఆర్ఏ ధ్రువీకరించగానే ఫిజికల్ రసీదు అందజేస్తారు. పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు ఆ కార్డుల్లేని రైతుల పంట వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. ► ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 96.41 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 43.35 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుంటే.. ఇప్పటి వరకు 35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 20 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు నమోదు చేశారు. సెప్టెంబర్ 15కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి, సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాల వారీగా స్టీరింగ్ కమిటీలు ► ఏపీలో ఈ–క్రాప్‌ను మోడల్‌గా తీసుకొని అగ్రి స్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ (ఏడీఏ) అమలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడీఏ ద్వారా పంటల సాగు ఆధారంగా రైతుల డేటా బేస్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు వెబ్ ల్యాండ్ డేటానే అన్నింటికీ ఆధారం. దీన్ని బట్టే పీఎం కిసాన్తో సహా ఇతర పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. ఇక నుంచి సీజన్ వారీగా పంటల సాగు ఆధారంగా రైతుల డేటాను తయారు చేసి, ఆ మేరకు వారికి సంక్షేమ ఫలాలు అందించాలని సంకల్పించింది. ► వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా జియో రిఫరెన్స్, విలేజ్ మ్యాప్, జీఐఎస్, ఆధార్ అథంటికేషన్, ఈ–కేవైసీలను అనుసంధానిస్తూ సీజన్ వారీగా రియల్ టైం క్రాప్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల కోసం రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీలు, అమలు కోసం జిల్లా స్థాయిలో ఇంప్లిమెంటింగ్ కమిటీలు నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ► ఈ డేటాతో పీఎం కిసాన్తో పాటు పీఎంఎఫ్‌బీవై వంటి సంక్షేమ పథకాలను అనుసంధానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఏపీని ఆదర్శంగా తీసుకొని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ– పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇదే బాటలో జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్రం కార్యాచరణ సిద్ధం చేసింది. ► ఇందుకోసం సోమవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యదర్శులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి మనోజ్ అహూజా ఆదేశాల మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్‌లు రాష్ట్రంలో అమలవుతున్న ఈ–పంట నమోదుపై అవగాహన కల్పించనున్నారు. కేంద్రానికి ఏపీ ఆదర్శం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన గౌరవమిది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట జాతీయ స్థాయిలో ఈ పంట నమోదుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బాటలోనే వాస్తవ సాగుదారుల డేటాను రూపొందించి పీఎం కిసాన్తో సంక్షేమ ఫలాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించడం నిజంగా శుభ పరిణామం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్‌లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
ఏపీ వైపు దేశం చూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దిశా నిర్దేçశం చేస్తూ.. ఏపీని మోడల్‌గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ వంటి సౌకర్యాలను పరిశీలించి, మీ రాష్ట్రాల్లో కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పడంతో సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారుల ఆరా సదస్సు ముగిసిన మర్నాడే రాజస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్ కటారియా తన బృందంతో కలిసి ఏపీలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని ఓ ఆర్బీకేను సందర్శించి, కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో పాటు.. గ్రామ స్థాయిలో అందిస్తోన్న సేవలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. తమ ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఉన్నత స్థాయి బృందాన్ని ఏపీ పర్యటనకు పంపిస్తామని ప్రకటించారు. తాజాగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, అస్సోం రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌కు ఫోన్ చేసి, ఏపీలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఆర్బీకేల తరహాలోనే తమ రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. రైతు సంబంధిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి.. తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే తమ రాష్ట్ర ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటిస్తాయని ప్రకటించారు. సాంకేతిక సహకారానికి సిద్ధం కేంద్రంతో సహా వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ తీసుకొస్తున్నారు. తమిళనాడులో గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. జాతీయ సదస్సు తర్వాత ప్రతి రోజు ఏదో రాష్ట్రం నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఏపీలో పర్యటించేందుకు ఆసక్తి చూపాయి. మరిన్ని రాష్ట్రాలు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుసగా ఈ బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. వారికి అవసరమైన సాంకేతికత అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన ఈ వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులు పల్లవి, కృష్ణతేజలను ఆశీర్వదించారు. చదవండి: (Divyavani: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు) -
అన్నదాతకు అండగా మేమున్నాం
-
రైతుల విషయంలో సీఎం జగన్ ద్యేయం అదే..
-
మెగా ప్రాజెక్ట్‌ల ద్వారా 55 వేల మందికి ఉపాధి
-
AP: రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విత్తు నుంచి మార్కెటింగ్ వరకు ఎలాంటి సమస్యలు ఎదురైనా చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రబీ కొనుగోళ్లు, ఖరీఫ్ సాగులో రైతులెదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ సలహా మండళ్లు, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యులతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పూనం మాలకొండయ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ఈ క్రాప్ బుకింగ్‌ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మిరప నారుమడులను పెంచే విషయంలో విధివిధానాలను రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. జిల్లా, మండల, ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్ల పనితీరును మెరుగుపరిచేలా కార్యాచరణ రూపొందించాలని, బోర్డుల్లో చేసిన తీర్మానాలను అమలు చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన వాస్తవ సాగుదారులందరికీ సీసీఆర్సీ కార్డులు(సాగుదారుల హక్కు పత్రాలు) అందేలా చూడాలని కోరారు. ఆర్బీకేలతో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో అనుసంధానించాలన్నారు. ఆ తర్వాత పూనం మాలకొండయ్య స్పందిస్తూ.. ఇక్కడ ప్రస్తావించిన ప్రతీ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమార్గాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్, పీఏస్ ప్రద్యుమ్న, సివిల్ సప్లయిస్ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వ్యవసాయ సలహా మండళ్ల అధ్యక్షులు సీహెచ్ సుబ్బారావు, త్రినాథ్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామారావు, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన ప్రతి పంటకూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రతి రైతుకూ మద్దతు ధర వచ్చేలా చూస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ ఏడాది మామిడి సీజన్లో 27 కిసాన్ రైళ్ల ద్వారా 16 వేల మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేసి రైతులకు మద్దతు ధర కల్పించినట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్‌తో కలిసి శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మామిడి కిలోకు సరాసరి ధర రూ.12కు తగ్గకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ యూనిట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కమిషనర్ ప్రతి వారం చిత్తూరు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయొద్దు కొందరు మామిడిపై తప్పుడు ప్రచారంతో మార్కెట్లో సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారని మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అందరినీ కోరుతున్నామన్నారు. దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మామిడి రైతులకు సరైన ధర రాదు అనే భయాన్ని కల్పించవద్దని కోరారు. ధరల స్థిరీకరణపై ప్రతి రోజూ సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్ రెండో దశ మొదలైనప్పటి నుంచి ఉద్యాన రైతులు పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యాన రంగంలో ఉన్న 256 ఎఫ్‌పీవో (రైతు సంఘాలు)లను వ్యాపారులు, మార్కెట్లతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఏపీకి ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీ, ముంబై, చెన్నైలోని కమిషనర్లు, మార్కెటింగ్ సెక్రటరీలు, పోలీసులతో మాట్లాడి రవాణా, ఎగుమతులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. మామిడి తోటలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదయ్యాయని, ఆ డేటాను బట్టి అక్కడి వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు ఏం చేయాలో చెప్పామన్నారు. కరోనా విపత్తు వల్ల పంట కోత సమయాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నా రైతులు పండించిన పంటలను మార్కెట్‌కి తరలించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. పండ్ల రవాణాకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇంకా 30 శాతం మామిడి పంట జూలై చివరి నాటికి వస్తుందని తెలిపారు. 2 వేల గోడౌన్లకు 8న సీఎం శంకుస్థాపన వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2 వేల గోడౌన్లు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తున్నారని మాలకొండయ్య తెలిపారు. దశలవారీగా రానున్న ఏడాది కాలంలో ప్రతి మేజర్ పంచాయతీలో ఒక గోడౌన్, ప్రతి ఆర్బీకేలో 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణాం చేపట్టాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. వెయ్యి మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తున్నామని, వీటివల్ల రైతులు వారి ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసుకోవచ్చన్నారు. ఉద్యాన పంటల కోసం ప్రతి ఆర్బీకేలో కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. ప్రతి జిల్లాలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్, తూర్పుగోదావరిలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అలా 25 చోట్ల ఫల ఉత్పత్తులకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్లతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. సాగు విస్తీర్ణం పెరిగింది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని మాలకొండయ్య తెలిపారు. మార్కెట్లో ఉద్యాన శాఖ మార్కెట్ జోక్యం వల్ల రైతులకు భరోసా లభించిందన్నారు. దీనివల్ల ఏడాది కాలంలోనే రైతులు ఇతర పంటల నుంచి సుమారు 65 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల వైపు మళ్లారని తెలిపారు. ఉద్యాన శాఖలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, డ్రోన్ల ద్వారా ఎరువులు స్ప్రే చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇతర పంటలకూ మంచి ధరలు రాష్ట్రంలోని రైతులు పండించిన ఇతర పంటలకూ మంచి ధరలు లభించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని మాలకొండయ్య పేర్కొన్నారు. క్వింటాల్ పసుపునకు రూ.6,850, మిరపకు రూ.7 వేలు, బత్తాయికి రూ.1,450, ఉల్లికి రూ.750, అరటికి రూ.800, చిరు ధాన్యాలకు రూ.2,500 ధర కల్పించామన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటివరకూ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్రం కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించని పంటలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శ్రేణీకృత మద్దతు ధర (గ్రేడెడ్ ఎంఎస్పీ)లను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వేరుశనగ ఏ గ్రేడ్‌కు కేంద్రం ఎంఎస్పీ ప్రకటిస్తుందని, బి గ్రేడ్ పండించిన రైతులకునా ధర లభించదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్ ఎంఎస్పీ ప్రకటించారు. పొగాకు బోర్డు గుంటూరులో ఉన్నా కోవిడ్ సమయంలో వాళ్లు ఏమీ చేయలేకపోయారని, సీఎం ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేటట్టు చేయగలిగిందని గుర్తు చేశారు. -
ఏపీ: పంటల రవాణాపై ఆంక్షలు లేవు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంటల రవాణాపై ఆంక్షలు లేవని అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మామిడి పండ్ల కోసం 27 కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశామని.. మామిడి ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. గత ఐదు వారాల నుంచి రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. మిర్చి, పసుపు, అరటి, ఆరెంజ్ పంటలకు మద్దతు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25చోట్ల పండ్ల ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జులై 8న 2 వేల గిడ్డంగుల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. చదవండి: గోదావరి జిల్లాల్లో సాగునీటి కష్టాలకు ఇక చెల్లుచీటీ! గ్రానైట్ అక్రమార్కులపై విజిలెన్స్ పంజా -
దుబాయ్ ఫుడ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్
సాక్షి, అమరావతి: దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు జరిగే ఈ గల్ఫ్ ఫుడ్–2021 ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడారు. ఏపీలో ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ స్టాల్లో ఏపీలో ఉన్న వనరులు, పంట ఉత్పత్తుల వివరాలు, పెట్టుబడిదారులకున్న అవకాశాలను చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ సీఈవో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: పాస్‌పోర్ట్‌కూ ‘డిజి లాకర్’.. ఒరిజినల్ డాక్యుమెంట్లను వెంట తీసుకురానక్కర్లేదు తగ్గుతున్న నిరుద్యోగిత.. రికార్డుస్థాయిలో ఉద్యోగాలు -
మిర్చి సాగు భళా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిర్చి సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రధాన పంటలలో ఒకటైన మిర్చి వచ్చే ఖరీఫ్‌లో 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 1.22 లక్షల హెక్టార్లలో సాగు అవగా ఈ ఖరీఫ్‌లో 1.50 లక్షల హెక్టార్లలో అవుతుందని అంచనా. అంటే 28 వేల హెక్టార్లలో అదనంగా సాగు అయ్యే అవ కాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగా విత్తన ప్రణాళిక ను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్య వెల్ల డించారు. సుమారు 40 వేల కిలోల విత్తనాలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భం గా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ► నాణ్యమైన విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల వద్దనే కొనుగోలు చేయండి. విత్తనానికి భరోసా ఉంటుంది. ► అధీకృత డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు, నమోదయిన నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలి. ► విత్తనాలు, నారు లభ్యతపై ఏమైనా సమస్య లుంటే స్థానిక మండల వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చు. ► నకిలీ విత్తనాన్ని అంటగట్టే ప్రమాదం ఉన్నందున అధిక డిమాండ్ ఉన్న హైబ్రీడ్ రకాలను ఎంచుకోవద్దు. ► భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే ఎరువులను వాడాలి. ► కల్తీ, నకిలీ విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్న ట్టు దృష్టికి వస్తే సమీపంలోని వ్యవసాయా« దికారికి లేదా 1902కి ఫిర్యాదు చేయవచ్చు. ► మిర్చి విత్తనాలకు విత్తన శుద్ధి చాలా అవస రం. పురుగు, తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వైరస్ నివారణకు ట్రైసోడియం ఆర్థోఫాస్పేట్తో విత్తన శుద్ధి చేయాలి. ఏఏ వంగడాలు అనువైనవంటే... అనువైన రకాలు, విత్తన శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన వర్సిటీ లాం పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సి. శారద రైతులకు పలు సూచనలు చేశారు. ► ఉద్యానవర్సిటీ నుంచి వెలువడిన జీ–3, జీ–4, జీ–5, సింధూర్, భాస్కర్, ఎల్సీఏ–334, ఎల్సీఏ–353 రకాలు అధిక దిగుబడులు ఇస్తాయి. ► సూటి రకాలలో ఎల్సీఏ–620, ఎల్సీఏ 625, సంకర రకాలలో ఎల్సీహెచ్–111, పాప్రికా రకాలలో ఎల్సీఏ 424, ఎల్సీఏ 436 ఉన్నాయి. ► ఎల్సీఏ–620 రకం 170 నుంచి 190 రోజుల్లో దిగుబడి వస్తుంది. హెక్టార్‌కు 65 నుంచి 68 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. ► పలు ప్రైవేటు సంస్థలు కూడా వివిధ రకాల సూటి, సంకర రకాలను విడుదల చేస్తున్నాయి. ఇండాయ్–5, తేజస్వినీ, యూఎస్–341, దేవనూర్ డీలక్స్, గోల్డ్–50, బీఎస్ఎస్–355, బీఎస్ఎస్–273, హెచ్‌పీహెచ్ 5531, ఎస్4884, ఎస్–5531 ముఖ్యమైనవి. -
వైద్యారోగ్యశాఖలో అవినీతిపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో భారీగా అవినీతి జరుగుతున్నదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో అవకతవకలపై ప్రజాధన పరిరక్షణ సమితికి చెందిన రామరాజు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. రూ.370 కోట్ల వ్యయంతో చేపడుతున్న ప్రాజెక్టు నిర్వహణ సంస్థ ఎంపికలో అక్రమాలు జరిగాయని, నకిలీ పత్రాలు సృష్టించి.. ధనుష్ సంస్థకు టెండర్ అప్పగించారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, ధనుష్ సంస్థ, ఏపీఎంఎస్డీసీ తదితరులను వివరణ కోరింది. -
విమ్స్ సేవలు పూర్తిగా ఉచితం
సాక్షి, విశాఖపట్నం : విమ్స్ సేవలు పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాల కొండయ్య చెప్పారు. ఎవరి వద్ద పైసా కూడా వసూలు చేయబోమన్నారు. సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ విమ్స్‌ను బలోపేతం చేస్తామే తప్ప ప్రైవేటుపరం చేయబోమని భరోసా ఇచ్చారు. విమ్స్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, ఇతర పోస్టులను పర్మినెంట్ రిక్రూట్మెంట్ పద్ధతిలోనే భర్తీ చేస్తామన్నారు. దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ట్రామా సర్వీసెస్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ప్రభుత్వపరంగా చేస్తున్నామన్నారు. కేజీహెచ్‌లో కూడా అందుబాటులో లేని సూపర్ స్పెషాలిటీ సేవలను విమ్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కార్డియాలజీతో సహా ఆరు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఇక్కడ ఎన్ని సౌకర్యాలు కల్పించినా పూర్తిగా ఉచితమే తప్ప ఏ అధునాతన సేవకు పైసా వసూలు చేసే ప్రసక్తే లేదన్నారు. విమ్స్‌లో టాటా క్యాన్సర్ సెంటర్ వస్తోందని, వాళ్లకు అవసరమైన సపోర్టు ఇస్తున్నామన్నారు. క్యాన్సర్‌లో స్టేజ్ స్టెమ్‌సెల్స్ రీసెర్చ్ ద్వారా మాత్రమే నివారించగలమని, ఈ అవకాశం రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోనూ లేదన్నారు. దీన్ని త్వరలో విమ్స్‌లో తీసుకొస్తున్నామన్నారు. ఈ సర్వీసులన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏర్పాటు చేయడం లేదని, పూర్తిగా ప్రైవేటు పార్టనర్ షిప్‌తో ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేసిన సేవలకుగాను వాళ్లకు పర్సంటేజ్ ఇస్తామే తప్ప రోగుల నుంచి ఆయా సంస్థలు పైసా కూడా వసూలు చేయనీయమన్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష పరిధిలోకి రాని వ్యాధులకు కూడా విమ్స్‌లో ఉచితంగా సేవలందుతాయన్నారు. -
ఆకస్మిక గుండెపోటు నుంచి రక్షణ!
సాక్షి, అమరావతి: ఆకస్మికంగా గుండెపోటు బారిన పడిన వారిని కాపాడేందుకు ఉద్దేశించి జనసమ్మర్థ ప్రాంతాల్లో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డెఫిబ్రిలేటర్స్(ఏఈడీ–ఎలక్ట్రిక్ షాక్ యంత్రాల)ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ నిర్ణయించింది. గుండె జబ్బులవల్లే దేశంలో అత్యధికులు చనిపోతున్నారని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ మరణాల్ని నియంత్రించే చర్యల్లో భాగంగా పబ్లిక్ ప్రదేశాల్లో జనరక్ష పథకం కింద ఏఈడీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి? నిర్వహణ ఖర్చులు ఎవరు భరించాలి? ఎలా నిర్వహించాలి? అనే అంశాల్ని వివరిస్తూ మార్గదర్శకాలతో వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీవో జారీచేశారు. సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరికైనా హఠాత్తుగా గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవడం ఆగిపోతే వెంటనే డాక్టర్ అందుబాటులో ఉండరు. ఇలాంటప్పుడు తక్షణమే ఏఈడీతో ఎలక్ట్రిక్ షాకిస్తే గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభిస్తుంది. తర్వాత వీలైనంత త్వరగా బాధితుల్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించడంద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. ఏఈడీలతో షాక్ ఇవ్వడానికి వైద్య నిపుణులక్కర్లేదు. పారామెడికల్స్ కూడా లేకుండా ఒకటి, రెండు సార్లు చూసినవారు(స్వల్ప శిక్షణ పొందినవారు) కూడా ఏఈడీని ఆపరేట్ చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే ప్రైవేట్ కంపెనీలు, బ్యాంకులు, జిమ్స్, స్టేడియాలు, బస్సు డిపోలు, క్లబ్‌లు, సామాజిక కేంద్రాలు, కల్యాణ మంటపాలు, ఆడిటోరియాలు, షాపింగ్‌మాల్స్‌తోపాటు ఇతర జనసమ్మర్థ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం తప్పనిసరని వైద్యశాఖ పేర్కొంది. అయితే వీటి నిర్వహణ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత ఆయా భవనాలు/సంస్థల యజమానులదేనని స్పష్టం చేసింది. వీటిని ఏర్పాటు చేసేలా రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీలను పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రోత్సహించాలని కూడా ఆదేశించింది. -
డాక్టర్లకు దండన
ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణపై సీరియస్ చర్యలకు శ్రీకారం చుట్టిన పూనం మాలకొండయ్య 20 మంది వైద్యులకు మూడు ఇంక్రిమెంట్లు కట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ కనీస బాధ్యతలు విస్మరిస్తున్న వైద్యులపై చర్యలు మొదలయ్యాయి. పేద రోగులకు సరిగా వైద్యం చేయకుండా {పైవేటుగా క్లినిక్‌లు నడుపుతున్న 20 మంది డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలతోపాటు దానికి అనుబంధంగా ఉండే జీజీహెచ్‌లో పనిచేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు తమ బాధ్యతలు విస్మరించి సొంత ఆసుపత్రులు నిర్వహించుకుంటున్నారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదికల ఆధారంగా పూనం మాలకొండయ్య చర్యలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ సొంతంగా ఆస్పత్రులు నిర్వహించు కోవడం నిబంధనలకు విరుద్ధం. జిల్లాలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు తమ విధులను కనీసంగా కూడా నిర్వర్తించకుండా ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకొచ్చే పేదలకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ప్రాథమిక వైద్యం సైతం వారికి అందే పరిస్థితులు లేవు. ఈ విషయంపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది. రెండేళ్ల కిందటే విచారణ పూర్తి చేసి 20 మంది వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫిర్యాదులొచ్చిన వైద్యులకు కేవలం షోకాజ్ నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు. దీంతో వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. వివరణపై సంతృప్తి చెందని ప్రిన్సిపల్ సెక్రటరీ.... ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులు ఇచ్చిన వివరణలపై పూనం మాలంకొండయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 మంది వైద్యులకు మూడు ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాలని డీఎమ్ఈని ఆదేశించారు. చర్యలకు గురైన వారిలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జి. సుబ్బారావు, మాజీ ప్రిన్సిపల్ శైలబాలతోపాటు 10 మంది ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్లున్నారు. జీజీహెచ్‌లో సెలవు పెట్టి ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కనువిప్పు కలిగేనా..? ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైద్యుల్లో కొందరు కనీస బాధ్యతలు మరిచి సొంత ప్రాక్టీస్‌పై శ్రద్ధ చూపుతుండడం వైద్య విద్యార్థులు, నిరుపేద రోగులకు శాపంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు తనిఖీలు చేపట్టి హెచ్చరించినా వీరిలో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం. కనీసం ఈ చర్యతోనైనా కనువిప్పు కలిగితే చాలంటూ వైద్య నిపుణులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 20 మంది ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు గుంటూరు మెడికల్: ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహిస్తున్న గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న 20 మంది వైద్యులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలను తీసుకుంది. చర్యలు తీసుకున్న వారిలో జనరల్‌మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ శనక్కాయల భానుఉదయ్శంకర్, డాక్టర్ దేవినేని సుధీర్‌బాబు, డాక్టర్ బి.శైలజ, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెనుగొండ యశోధర, రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జీవీ పార్వతీశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిటితోటి కిషోర్‌కుమార్, పెథాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ గరికపర్తి శైలబాల, డాక్టర్ సి.పద్మావతి, గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ వీఏఏ లక్ష్మి, డాక్టర్ పి.చంద్రశేఖరరావు, ఎ.కవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.స్వరూపరాణి, చెస్ట్, టీబీ వ్యాధుల వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకంటి రఘు, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కట్టా శ్రీనివాసరావు, డాక్టర్ గడ్డం విజయసారధి, అర్థోపెడిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ నారాయణరావు, యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.రవిచంద్రకుమార్, ఈఎన్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కొణిదె రవి, కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మండవ శ్రీనివాసరావులు ఉన్నారు. వీరిలో డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, డాక్టర్ దేవినేని సుధీర్‌బాబు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలి : ఎంపీ బుట్టా
► రూ.250కోట్లు విడుదల చేయాలి ► వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్/టిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక కోరారు. బుధవారం ఏపీ సెక్రటేరియట్లో ఆమెను కలిసి ఆసుపత్రి, కళాశాల సమస్యలపై విన్నవించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రికి సంబంధించిన వివిధ ఆధునీకరణ పథకాల నిధుల మంజూరు, స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ, ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన మందుల సరఫరా.. తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కర్నూలు బోధనాసుపత్రికి రూ.250కోట్లు కేటాయించి రిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పీఎంఎస్ఎస్వై ప్రోగ్రామ్ కింద ప్రతిపాదనలను పంపించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఎంపీగా తాను ఇదివరకే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కర్నూలు మెడికల్ కాలేజి డైమండ్ జూబ్లి ఉత్సవాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వం తరఫున ప్రధాన మంత్రిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం కర్నూలులో రెండు, మూడురోజులు పర్యటించి ఈ విషయాలపై చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య చెప్పారు. -
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి లీజు 33 ఏళ్లు
చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి 33 ఏళ్ల లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఐదేళ్ల లీజుకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి తాజాగా 33 ఏళ్లకు ఇచ్చినట్టు జీవోలో పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, ఉన్నతీకరణ వంటివి గతంలో పేర్కొన్నట్టు అపోలో యాజమాన్యం చేపడుతుందని పేర్కొన్నారు. -
'రాష్ట్రంలో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో 275 ఎన్టీఆర్ వైద్య సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ఉన్నతాధికారులతో పూనం మాలకొండయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గర్భిణీకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామన్నారు. త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ నియామకాలు చేపడుతున్నట్లు పూనం మాలకొండయ్య వివరించారు. -
‘హెల్త్’ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూనం
* ఎక్సైజ్ కమిషనర్‌గా మీనా * ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. యువజన, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించింది. ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారుల శాఖలను మార్చింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నరేశ్‌ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. సాధారణ పరిపాలన విభాగం(రాజకీయ) కార్యదర్శిగా పనిచేస్తోన్న ముకేశ్ కుమార్ మీనాను ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ కమిషనర్‌గా, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ బి.కిశోర్‌ను సాధారణ పరిపాలన విభాగం (సర్వీసెస్) కార్యదర్శిగా బదిలీ చేశారు. సహకార శాఖ స్పెషల్ కమిషనర్ శేషగిరిబాబుకు మార్కెటింగ్ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన విభాగం (ప్రొటోకాల్) సంయుక్త కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఈడీ, ఎయిడ్స్ నియంత్రణ మండలి పీడీగా నియమించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఓఎస్డీగా ఉన్న లెప్టినెంట్ కల్నల్ ఎం.అశోక్‌బాబును ప్రొటోకాల్ విభాగం డెరైక్టర్‌గా నియమిస్తూ గురువారం సీఎస్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అప్రధాన శాఖ టూరిజం, యూత్ అడ్వాన్స్‌మెంట్‌శాఖకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.