చిత్తూరు జిల్లా ఆస్పత్రిని అపోలో యాజమాన్యానికి 33 ఏళ్ల లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఐదేళ్ల లీజుకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి తాజాగా 33 ఏళ్లకు ఇచ్చినట్టు జీవోలో పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పన, ఉన్నతీకరణ వంటివి గతంలో పేర్కొన్నట్టు అపోలో యాజమాన్యం చేపడుతుందని పేర్కొన్నారు.
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి లీజు 33 ఏళ్లు
Published Thu, Apr 28 2016 7:49 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement