అన్ని వర్గాలను సంప్రదిస్తున్నాం: పూనం | Telangana State to tighten laws for women safety | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను సంప్రదిస్తున్నాం: పూనం

Sep 11 2014 8:15 PM | Updated on Sep 2 2017 1:13 PM

అన్ని వర్గాలను సంప్రదిస్తున్నాం: పూనం

అన్ని వర్గాలను సంప్రదిస్తున్నాం: పూనం

మహిళల రక్షణ, భద్రతపై ఈ నెల 20న తెలంగాణ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇస్తామని మహిళారక్షణ చట్టం కమిటీ కన్వీనర్ పూనం మాలకొండయ్య తెలిపారు.

హైదరాబాద్: మహిళల రక్షణ, భద్రతపై ఈ నెల 20న తెలంగాణ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇస్తామని మహిళారక్షణ చట్టం కమిటీ కన్వీనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. పూర్తిస్థాయి నివేదికకు మరో 2 నెలల సమయం పడుతుందని వెల్లడించారు. మహిళల రక్షణకోసం తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాలను సంప్రదిస్తున్నామని చెప్పారు.

త్వరలో కాలేజీ యువత, గృహిణిలతో కూడా చర్చిస్తామని తెలిపారు. అత్యాచారాల నిరోధానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు ఉండేలా చూస్తామన్నారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, స్వచ్ఛంద సంస్థలను సైతం కలుస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం-మహిళారక్షణ చట్టం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement