మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వానికి ‘ముక్త’ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళల అధ్యయన వేదిక ‘ముక్త’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యాచారాలు, వేధింపులు.. మహిళల సమస్యలకు పరిష్కార మార్గాలపై అధ్యయ నం చేసి ‘ముక్త’ రూపొందించిన నివేదికను గురువారం రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చైర్‌పర్సన్ పూనం మాలకొండయ్యకు సంస్థ ప్రతినిధులు అందజేశారు.
నిరక్షరాస్యత, పసలేని పాఠ్యాంశాలు, కుంటుపడుతున్న బాలికావిద్య, మహిళలను అపహరించి విక్రయించడం, స్కూళ్లు, హాస్టళ్లలో వసతులు వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. నివేదిక ప్రతిని సీఎం కార్యాలయంలో కూడా అందజేశారు. చైర్‌పర్సన్‌ను కలిసినవారిలో ‘ముక్త’ అధ్యక్షురాలు విమల, ప్రధానకార్యదర్శి కిరణ్‌కుమారి, టి.దేవకీదేవి, వసుధ, కె.శైలజ, శోభ, నకాషి ఉన్నారు.