Womens University
-
మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని చాటాలన్న ఉద్దేశంతో మంత్రివర్గ సహచరుల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే..ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గడీలలో గడ్డి మొలవాలన్న చాకలి ఐలమ్మ మాటలను, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని గుర్తుచేశారు. దొరల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు, రైతులకు పంచేందుకు నాటి ప్రధాని ఇందిరా గాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు చాకలి ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి అన్నారు. భూమి అనేది పేదలకు ఆత్మగౌరవం, జీవన ఆధారం అని చాటి చెబుతూ పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచి ఇచ్చిన ఇందిరాగాంధీ ప్రతి పేదవాడి కుటుంబంలో దైవంగా నిలిచారన్నారు. భూహక్కులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, తెలంగాణలో పేదల చేతుల్లో లక్షలాది ఎకరాల భూమి ఉండడానికి ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలు, పీవీ నర్సింహారావు వాటిని అమలు చేయడమే కారణమని రేవంత్ చెప్పారు.లక్షల ఎకరాలు లాక్కొనేందుకు గత సర్కార్ కుట్ర..పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను, అసైన్మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను లాక్కొనేందుకు ధరణి ముసుగులో గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పారు. సమాజంలో సామాజిక చైతన్యం తెచ్చిన వ్యక్తులు, పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల పేర్లు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉండేలా సంస్థల పేర్లు పెడుతున్నామన్నారు.ఆకట్టుకున్న నృత్యరూపకంచాకలి ఐలమ్మ జీవిత చరిత్రను తొలిసారి కూచిపూడి, జానపద శైలిలో ప్రదర్శించిన నృత్య రూపకం ఉత్తేజభరితంగా సాగింది. ఐలమ్మ జీవితంలోని ప్రధాన ఘట్టాలను, ఆమె సాగించిన సాయుధ రైతాంగ పోరాటాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అద్భుత ప్రదర్శనతో కళ్లకు కట్టేలా చూపారు. దివంగత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించిన చాకలి ఐలమ్మ నృత్య రూపకం కాన్సెప్ట్, నృత్య దర్శకత్వం డా. అలేఖ్య పుంజాల నిర్వహించగా, వి.బి.ఎస్. మురళి బృందం సంగీత సహకారం అందించి రక్తి కట్టించారు. ఈ దృశ్యకావ్యాన్ని సీఎం, మంత్రులు సహా ప్రేక్షకులంతా ఆసక్తిగా తిలకించారు. ప్రతి ఘట్టంలో ప్రొ. అలేఖ్య ప్రదర్శించిన హావభావాలు, అద్భుత సమన్వయంతో మిగతా బృందం అందించిన సహకారంతో ప్రదర్శన ఆసాంతం ఆహూతులను అలరించింది. సీఎం రేవంత్ తన ప్రసంగంలోనూ ఈ ప్రదర్శనను ప్రస్తావించారు. ‘చాకలి ఐలమ్మ దృశ్యకావ్యాన్ని అలేఖ్య బృందం కళ్లకు కట్టినట్లు చూపింది. ఎంతో ఏకాగ్రత ఉంటే తప్ప ఇంత గొప్ప ప్రదర్శన సాధ్యం కాదు’ అని సీఎం ప్రశంసించారు. తాను ఇప్పటివరకు ఎన్నో పాత్రలు ప్రదర్శించానని, సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ పాత్రను పోషించడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినిచ్చిందని అలేఖ్య పుంజాల అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి సూచనతోనే దీన్ని రూపొందించినట్లు చెప్పారు.ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్‌లో చోటుచాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు సైతం ప్రభుత్వంలో భాగస్వాము లుగా ఉండాలని భావిస్తున్నామని... చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను సీఎం ఆదేశించారు. మహిళలపై దాడులను తిప్పికొట్టేందుకు, మహిళా హక్కుల పరిరక్షణకు ఉన్న మహిళా కమిషన్‌లో ఐలమ్మ వారసులు ఉండటం సము చితమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నించే గొంతుకలే తమకు కావాలని.. ప్రజాసమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించే వాళ్లే కాంగ్రెస్ ప్రభు త్వానికి కావాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంతకుముందు ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. -
సింగపూర్ విద్యార్ధులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం నృత్య కోర్సులు
శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం (మహిళా విశ్వవిద్యాలయం) విద్య సంగీతం అకాడమీ (సింగపూర్) లు సంయుక్తంగా సింగపూర్ విద్యార్ధులకు నృత్య కోర్సులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైస్ ఛాన్సలర్, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ) అధ్యక్షతన, ఎస్పీఎంవీవీ అంతర్జాతీయ సంబంధాల విభాగానికి చెందిన యూనివర్సిటీ అధికారులు, సింగపూర్‌లోని తెలుగు, భారతీయ సంగీత ప్రియులు రాగవిహారి పేరుతో విద్యార్థుల ప్రదర్శనల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత్, సింగపూర్ సంగీత ఔత్సాహికులు యూట్యూబ్, సోషల్ మీడియాలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మావతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జమున దువ్వూరు మాట్లాడుతూ..మహిళా యూనివర్సిటీ తరుపున ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ..ఎస్పీ ఎంవీవీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీన్ డాక్టర్ పి విజయలక్ష్మి, ఎస్పీఎం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ ద్వారం వీజేలక్ష్మి ఈ కొలాబరేషన్ ప్రత్యేకమైన సింగపూర్ శైలిలో జరుగుతోందని, దీన్ని వ్యాప్తి చేసేందుకు విద్యా సంగీతం అకాడమీకి వారి సహకారం పూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో విద్యా సంగీతం అకాడమీ (వీఎస్ఏ) వ్యవస్థాపకురాలు, శ్రీమతి కాపవరపు విద్యాధరి మాట్లాడుతూ, “పలు సంగీత నృత్య కార్యక్రమాలను అందించడానికి సుప్రసిద్ధ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీ ఎంవీవీ)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సంగీతం (గాత్రం / వాయిద్యం) మరియు నృత్యం (కూచిపూడి / భరతనాట్యం) అలాగే అన్నమయ్య కీర్తనలు మరియు వాగ్గేయకార వైభవం కోసం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఈ ఒప్పందం ద్వారా సింగపూర్ లో పిల్లలకు అందిస్తాము. సింగపూర్‌లో మన సంస్కృతిని ప్రచారం చేసేందుకు వీఎస్ఏ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. ఎస్ఫీ ఎంవీవీ అధికారులు వారి మద్దతు, సౌలభ్యం మరియు అనేక నెలలపాటు పని చేయడం ద్వారా దీనికి రూపకల్పన చేసినందుకు నేను వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్, చిరకాల సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రెసిడెంట్ రత్నకుమార్ కవుటూరు ఎస్పీ ఎం వీవీ , వీఎస్ఏ బృందాల ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ సహకారాన్ని "సింగపూర్‌లోని ఎన్ఆర్ఐ విద్యార్థులు సంగీతం నేర్చుకునేందుకు, ఎస్పీ ఎంవీవీ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి గుర్తింపు పొందేందుకు ఒక గొప్ప అవకాశం" అని అభివర్ణించారు. మన సంస్కృతి, సంగీతం యొక్క ప్రభావాలను యోగాతో పోల్చుతూ, సింగపూర్ తెలుగు సమాజం వైస్ ప్రెసిడెంట్ జ్యోతేశ్వర్ రెడ్డి కురిచేటి ఈ సహకారాన్ని సంగీతాన్ని ఇష్టపడే పిల్లలందరూ ఆదరించడానికి ఒక ముఖ్యమైన, సంతోషకరమని పేర్కొన్నారు.భారతదేశం నుండి ప్రముఖ వక్త, రంగస్వామి కృష్ణన్ ఇలాంటి సహకారాలు మన దైనందిన జీవితంలో పెరగాలని, సంస్కృతిని వ్యక్తపరచాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ సింగపూర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బు వి పాలకుర్తి కూడా నిర్వాహకుల కృషిని అభినందించారు. విద్యా సంగీతం అకాడమీ విద్యార్థుల ప్రకటనలు, సందేశాలు, ప్రదర్శనలతో ఒక ప్రత్యేకమైన మిక్స్‌గా జరిగిన ఈ రెండు గంటల కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎందరో వీక్షకులచే ప్రశంసించబడింది. సింగపూర్‌లోని విద్యార్థుల కోసం ఎన్రోల్మెంట్లు తెరిచామని వీఎస్ఏ టీం ధృవీకరించింది. కోర్సు వివరాల,రిజిస్ట్రేషన్ల కోసం ఆసక్తిగల అభ్యర్థులు vidyasangeetam.academy ద్వారా సంప్రదించాలని వీఎస్ఏ ప్రతినిధి విద్యాధరి పేర్కొన్నారు. -
అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
పాట్నా: ‘కళాశాలకు వస్తుంటే తల విరబూసుకుని జట్టు వేసుకోకుండా వస్తే ఇకపై అనుమతి లేదు. హీరోయిన్ మాదిరి తయారై వస్తే కళాశాలలోకి అడుగు పెట్టేదే లేదు’ అని బిహార్ భగల్పూర్లో ఉన్న సుందర్‌వతి మహిళా మహావిద్యాలయం నిర్ణయం తీసుకుంది. విద్యా ఆవరణలో క్రమశిక్షణ, పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇటీవల విద్యాలయ ప్రిన్సిపల్ పలు నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్‌తో పాటు అలంకరణ, వేషధారణ పలు విషయాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు) కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడ వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని రావొద్దు. కళాశాల గేటు లోపలకి వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దు. డ్రెస్ కోడ్ విధిగా పాటించాలి. రాయల్ బ్లూ బ్లేజర్ లేదా, చలికోటు ధరించాలి. పైవీ ఏవైనా ఉల్లంఘిస్తే కళాశాలకు అనుమతించరు. ఈ నిబంధనలను విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమణ్ సిన్హా తెలిపారు. ఈ నిబంధనలపై విమర్శలు రావడంపై కొట్టిపారేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఇదో తుగ్లక్ నిర్ణయమని ఎద్దేవాచే సింది. మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యాలయంలో మొత్తం విద్యార్థులు 1,500మంది ఉన్నారు. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో -
మహిళా వర్సిటీలో తెల్ల ఏనుగులు
సాక్షి, తిరుపతి : పారదర్శక పాలన, జవాబుదారీతనం, నిజాయితీతో ప్రజలకు పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన 2323 జీవోను విడుదల చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని, వారి స్థానంలో యువతకు అవకాశాలు కల్పించాలని జీవోలో పేర్కొంది. టీటీడీ విద్యా సంస్థలు, ఎస్వీయూ ఈ జీవోను వెంటనే అమలు చేశాయి. మహిళా వర్సిటీలో మాత్రం ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రాతిపదికన పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ జీఓ మేరకు టీటీడీ 194 మంది రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించింది. టీటీడీ విద్యా సంస్థల్లో పనిచేసి, ఉద్యోగ విరమణ తర్వాత మళ్లీ కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించారు. టీటీడీ జూనియర్ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న రిటైర్డ్ అధ్యాపకులను తప్పించారు. డిగ్రీ కళాశాలల్లో పనిచేసే 56 మందిని ఇంటికి పంపారు. ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ అనంతరం వివిధ పేర్లతో చేరి పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తాజా జీఓ ప్రకారం తొలగించారు. ఐదుగురు ఉద్యోగులను తొలగిస్తూ ఈ నెల 5న ఎస్వీయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని యూనివర్సిటీలు, ఇతర సంస్థలు జీఓను పక్కాగా అమలు చేశాయి. పట్టించుకోని మహిళా వర్సిటీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీఓ 2323ను శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఏమాత్రమూ పట్టించుకోలేదు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు, ఇతర విభాగాల్లో మరో ఇద్దరు, టెక్నికల్ విభాగం, ఇతర శాఖలలోకలిపి 15 మంది నిబంధలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ఉద్యోగుల వల్ల వర్సిటీపై నెలకు రూ.10 లక్షల వరకు, ఏడాదికి కోటి రూపాయలకు పైగా భారం పడుతోంది. అంతేకాకుండా యువతకు అవకాశాలు రాకుండా రిటైర్డ్ అ«ధ్యాపకుల వల్ల నష్టం కలుగుతోంది. ప్రభుత్వ జీఓను అమలు చేయకపోగా రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని మొండిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులను తొలగించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం ఈ నెల 6న వినతిపత్రం సమరి్పంచింది. అయినప్పటికీ వర్సిటీ అధికారులు స్పందించలేదు. తెల్ల ఏనుగుల్లా.. మహిళా వర్సిటీలో రిటైర్డ్ అధ్యాపకులు తెల్ల ఏనుగుల్లా మారారు. వారి స్థానంలో యువతకు రెట్టింపు స్థానంలో అవకాశాలు ఇవ్వవచ్చు. అయినప్పటికీ రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఓ 2323ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా.. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్‌ను నియమించుకున్నారు. నిబంధనల మేరకు 65 దాటిన అధ్యాపకులకు నిర్ణయాలు తీసుకునే పదవులు ఇవ్వరాదు. ఇక్కడ డైరెక్టర్‌గా పనిచేసే ప్రొఫెసర్‌కు 65 సంవత్సరాలు దాటినా కొనసాగిస్తున్నారు. నిత్యం అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వారిని పొగడడమే ఆయన పనిగా పెట్టుకున్నారని గుసగుసలున్నాయి. తమకు అన్ని విధాలా అనుకూలంగా ఉండడంతో ఆయనను నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగిస్తున్నట్లు విమర్శలున్నాయి. -
త్వరలో రుద్రమదేవి మహిళా వర్సిటీ!
* తెలంగాణకు ప్రత్యేక మహిళా వర్సిటీ * వరంగల్ జిల్లాలో ఏర్పాటు * త్వరలో అధికారిక ప్రక్రియ సాక్షి, హన్మకొండ: వరంగల్ జిల్లాలో మరో ప్రతి ష్టాత్మక విద్యాసంస్థ నెలకొల్పే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాకతీయరాణి రుద్రమదేవి పేరుతో మహిళా వర్సిటీని వరంగల్ జిల్లాలో స్థాపించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పరి శీలిస్తోంది. వరంగల్-హైదరాబాద్ రహదారిలో మహిళా వర్సిటీ స్థాపనకు అవసరమైన స్థలాల కోసం అన్వేషిస్తోంది. అన్నీ కుదిరితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీని నెలకొల్పారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర మూడు ప్రాంతాలకు 36:42:22 నిష్పత్తిలో ఇక్కడి కోర్సుల్లో విద్యార్థినులు ప్రవేశాలు పొందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పద్మావతి మహిళా వర్సిటీలో చేరేందుకు తెలంగాణకు చెందిన విద్యార్థినులు ఆసక్తి చూపడం లేదు. 2012-13 విద్యా సంవత్సరంలో ఈ వర్సిటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంలో పద్మావతి మహిళా వర్సిటీలో వివిధ కోర్సులు చదువుతున్న దాదాపు 200కు పైగా తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇబ్బం దులు పడ్డారు. దీంతో తెలంగాణలో మహిళా వర్సిటీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రుద్రమదేవి పేరుతో మహిళా వర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చిన నేపథ్యంలో మహిళా వర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి) : డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)కు చెందిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్‌కు మహిళా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 29న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే 16వ స్నాతకోత్సవంలో ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె స్నాతకోపన్యాసం చేస్తారు. డాక్టర్ టెస్సీథామస్ డీఆర్డీవోలో 5వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధ విమానం అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈమె మనదేశంలో మిసైల్ ప్రాజెక్ట్‌లో డెరైక్టర్‌గా పనిచేస్తున్న తొలి మహిళా శాస్త్రవేత్త. ఈమె ఇంతకు ముందు 3 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధవిమానం(మిసైల్) అగ్ని-3కి అసోసియేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈమె హైదరాబాద్‌లోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వానికి ‘ముక్త’ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళల అధ్యయన వేదిక ‘ముక్త’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యాచారాలు, వేధింపులు.. మహిళల సమస్యలకు పరిష్కార మార్గాలపై అధ్యయ నం చేసి ‘ముక్త’ రూపొందించిన నివేదికను గురువారం రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్యకు సంస్థ ప్రతినిధులు అందజేశారు. నిరక్షరాస్యత, పసలేని పాఠ్యాంశాలు, కుంటుపడుతున్న బాలికావిద్య, మహిళలను అపహరించి విక్రయించడం, స్కూళ్లు, హాస్టళ్లలో వసతులు వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. నివేదిక ప్రతిని సీఎం కార్యాలయంలో కూడా అందజేశారు. చైర్‌పర్సన్‌ను కలిసినవారిలో ‘ముక్త’ అధ్యక్షురాలు విమల, ప్రధానకార్యదర్శి కిరణ్‌కుమారి, టి.దేవకీదేవి, వసుధ, కె.శైలజ, శోభ, నకాషి ఉన్నారు. -
ముస్తాబవుతున్న మహిళా వర్సిటీ
రేపు స్నాతకోత్సవం జోరందుకున్న ఏర్పాట్లు యూనివర్సిటి క్యాంపస్ : దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బుధవారం జరుగనున్న స్నాతకోత్సవానికి మహిళావర్సిటి సిద్ధం అవుతోంది. ప్రస్తుత వీసీ రత్నకుమారి పదవి చేపట్టాక జరుగుతున్న తొలి స్నాతకోత్సవం, నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్నది కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరిసారిగా 2010 సెప్టెంబర్17న స్నాతకోత్సవం నిర్వహించారు. తర్వాత యేడాదిపాటు రెగ్యులర్ వీసీని నియమించక పోవడం, రత్నకుమారిని వీసీగా నియమించినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చోటు చేసుకోవడం వల్ల 15వ స్నాతకోత్సవానికి ముహూర్తం కుదరలేదు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. స్నాతకోత్సవం కోసం మూడురోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇందిరా ప్రియద ర్శిని ఆడిటోరియంకు రంగులు వేస్తున్నారు. వర్సిటీలోని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 1948 మందికి డిగ్రీలు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ హాజరై డిగ్రీలను ప్రదానం చేస్తారు. 14వ స్నాతకోత్సవంలో ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల్ ఇవ్వగా ప్రస్తుతం ఒకరికి మాత్రమే ఇస్తున్నారు.