టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్ | Tessa Thomas to the Women's University Honorary Doctorate | Sakshi
Sakshi News home page

టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్

Published Thu, Jul 2 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్

టెస్సీ థామస్‌కు మహిళా వర్సిటీ గౌరవ డాక్టరేట్

 యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి) : డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)కు చెందిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్‌కు మహిళా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 29న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే 16వ స్నాతకోత్సవంలో ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె స్నాతకోపన్యాసం చేస్తారు. డాక్టర్ టెస్సీథామస్ డీఆర్‌డీవోలో 5వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధ విమానం అగ్ని-4కు ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు.

ఈమె మనదేశంలో మిసైల్ ప్రాజెక్ట్‌లో డెరైక్టర్‌గా పనిచేస్తున్న తొలి మహిళా శాస్త్రవేత్త. ఈమె ఇంతకు ముందు 3 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే యుద్ధవిమానం(మిసైల్) అగ్ని-3కి అసోసియేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈమె హైదరాబాద్‌లోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement