Vimala
-
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు: వైఎస్సార్ సోదరి విమల
సాక్షి, విజయవాడ: వైఎస్ కుటుంబ పడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకు తీసుకువస్తున్నారని వైఎస్సార్ సోదరి విమల ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు ఏది మాట్లాడినా కరెక్ట్ అని ఎలా అనుకుంటున్నారని, వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంట్లో అమ్మాయిలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని అల్లరి పెట్టడం బాధగా అనిపిస్తోందని అన్నారామె. వైఎస్ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు. మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు. నిత్యం షర్మిల అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అవినాష్ హత్య చేయడం ఆ ఆడపిల్లలిద్దరూ చూశారా?. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వాళ్లే(షర్మిల, సునీతలు) డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు?. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా?.. .. షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉంది. అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు. అతనికి కుటుంబం ఉంది. ఏ పాపం చేయని నా సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నాడు. అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు. హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది. శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి. వైఎస్సార్ ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు. వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా ఉన్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు .. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు. అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది. షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు. మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు. మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు. వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు .. కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా?. వైఎస్సార్ ఉన్నపుడు వివేకానంద రెడ్డి కడప చూసుకున్నారు. ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు. నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు. మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు. శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు. అవినాష్ పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది. షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు. షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి వాళ్లిద్దరూ ఇదంతా చేస్తున్నారు. .. జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు. బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. లేదంటే ఒకసారి షర్మిల, సునీత మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానంద రెడ్డి పనిచేశారు. ప్రజలంతా సీఎం జగన్ కి అండగా ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్ కు, జగన్ కు ఓట్లు వేసి గెలిపించాలి. షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు. -
సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది
లక్డీకాపూల్ (హైదరాబా ద్): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు. -
ఎవరండీ ఇంట్లో?
ముఖాన్నే తలుపులు వేయిస్తున్న ప్రశ్న. ప్యాడ్‌ను లాక్కునేలా చేస్తున్న ప్రశ్న. పేపర్‌ను చింపేయిస్తున్న ప్రశ్న. అన్ని ప్రశ్నలకూ సమాధానం.. మళ్లీ అదే ప్రశ్న! ‘ఎవరండీ ఇంట్లో..?’ విమలమ్మ కరోనా సర్వే వర్కర్. విరిగిన కాలితోనే డ్యూటీ చేస్తోంది. కోపాలను తగ్గించి వివరాలను కనుక్కోలేదా? విమల కుమారి అంగన్వాడి వర్కర్. ఇంటింటికి వెళ్లి కరోనాను పోలిన వ్యాధి లక్షణాలు ఉన్న వారి లెక్కలు సేకరించమని బిహార్ ప్రభుత్వం నియమించిన ఆశా, అంగన్వాడి వర్కర్లలో ఆమె ఒకరు. ఏప్రిల్ 16 నుంచి మే 3 వరకు ఆమె 380 ఇళ్లను సర్వే చేశారు. పాట్నాలోని బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పాట్నా విద్యుత్ సరఫరా కార్యాలయాలకు ఆనుకుని ఉండే మురికివాడల్లోని ఇళ్లు అవన్నీ. చేతిలో ప్యాడు, పెన్నుతోపాటు ఒక చేతికర్ర సహాయంతో ఆమె ఆ ఇళ్లన్నీ తిరిగి వివరాలు రాసుకున్నారు. సర్వేకోసం వెళ్లినప్పుడే రోడ్డుమీద నీళ్ల గుంటలో పడి ఆమె కాలు విరిగింది. నడవలేక చేతి కర్రను తెచ్చుకుంటున్నారు. నడవలేక సెలవు పెట్టవచ్చు. అందుకు ఆమె ఇష్టపడలేదు. శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి రేణుకుమారి సెలవు మంజూరు చేశారు. విమల వినలేదు. పాట్నా జిల్లా ఐసిడిఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు) అధికారి భారతి ప్రియంవద కూడా పిలిపించి చెప్పారు. సెలవు అవసరం లేదనే అన్నారు విమల! పాట్నా జిల్లా జడ్డి కుమార్ రవి సోమవారం తన ట్విట్టర్లో విమల ఫొటోను షేర్ చేశారు. ‘ఈ మహిళ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. ఈమె పేరు విమల కుమారి. అంగన్వాడి కార్యకర్త. కాలు విరిగినప్పటికీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పాట్నా పట్టణంలో తనకు కేటాయించిన ప్రాంతాల ఇళ్లను సర్వే చేస్తూనే ఉన్నారని నాకు ఐసిడిఎస్ టీమ్‌ల ద్వారా తెలిసింది. అంకితభావం, పనిలో నిబద్ధత ఈ మహిళలో మనం చూడొచ్చు’ అని రాశారు. ఎరుపంచు తెల్లచీరలో.. తలకు హెయిర్ నెట్, ముఖానికి మాస్క్, చేతులకు గ్లవుజులు, చేతిలో సర్వే ప్రశ్నావళి కాగితాలు పట్టుకుని, కట్టుకట్టిన కాలితో.. జిల్లా జడ్జి అన్నట్లే అంకితభావానికి ఒక ఆకృతిలా ఉన్నారు ఆ ఫొటోలో విమల కుమారి. విమల వయసు 46 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. 23 ఏళ్ల కూతురు, ఇద్దరు కొడుకులు. 22 ఏళ్లు, 18 ఏళ్లు. పిల్లలంతా చదువుల్లో ఉన్నారు. ఈ కుటుంబం ఉంటున్నది కూడా మురికివాడలోనే. పాట్నా పట్టణంలోని లలిత్ భవన్ సమీపంలో. ఒక గది ఉన్న చెక్కల ఇల్లు. భర్త పదిహేనేళ్ల క్రితమే చనిపోయాడు. అంగన్వాడి వర్కర్‌గా ఇప్పుడు ఆమె జీతం రూ.5,650. ఆమె పని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా చూడటం. ప్రస్తుతం సర్వే డ్యూటీలో ఉన్నారు. మార్చి నెలాఖరులో విమల కాలు విరిగింది. అప్పటికి ఆమె తొలి విడత సర్వే పనుల్లో ఉన్నారు. ఎవరింట్లోనైనా శ్వాసకోశ ఇబ్బందులు, ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలు ఉన్నాయేమో తెలుసుకుని ఆ వివరాలు నోట్ చేసుకుని వెంటనే ఆరోగ్య అధికారులకు చేరవేయడం ఆమె బాధ్యత. ఇంట్లోంచి ఉదయాన్నే 8 గంటలకు డ్యూటీకి బయల్దేరుతారు. ఆమెకు సహాయంగా నర్సింగ్ మిడ్వైఫ్ ఒకరు ఉంటారు. మధ్యాహ్నానికల్లా కనీసం 25 ఇళ్లలోని వివరాలు సేకరిస్తారు. అక్కడితో ఆ రోజుకు సర్వే పని పూర్తవుతుంది. మధ్యాహ్నం నుంచి ఐసిసిఎస్ పరిధిలోని ఇతరత్రా విధులు ఉంటాయి. సెలవే పెట్టని ఇంత మొండి మనిషిని ఎక్కడా చూడలేదని విమల గురించి భారతి ప్రియంవద అంటారు! ‘కఠిన పరిస్థితుల్లో విమల మరింత ప్రశాంతంగా నెగ్గుకొస్తుంది. సర్వేకి వచ్చిన అంగన్వాడి వర్కర్లు ముఖాల మీదే తలుపులు వేసేవారు. చేతిలోని పెన్ను, పేపర్ లాక్కొని వెళ్లగొట్టేవారు కూడా ఉంటారు. అయితే విమల అలాంటి వాళ్లను కూడా సౌమ్య పరిచి వివరాలు రాబడుతుంది’’ అని రేణుకుమారి చెబుతారు. అయితే విమల అనే మాట వేరే. ‘‘నేను సెలవు పెడితే.. ఏ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో తెలుసుకోలేను. అందువల్ల వాళ్లకు అవసరమైన తక్షణ వైద్య సహాయం అందకుండా పోతుంది’’ అంటారు. ప్రస్తుతం మూడోవిడత సర్వే పనిలో ఉన్నారు విమల. మొదట పాట్నా సహా నాలుగు జిల్లాలకు మాత్రమే సర్వేను పరిమితం చేసిన బిహార్ ప్రభుత్వం ఇప్పుడు మిగతా ముప్పై నాలుగు జిల్లాలలో కూడా సర్వేను ప్రారంభించింది. బిహార్‌లో ఇప్పటి వరకు 550 కోవిద్ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు చనిపోయారు. విమల వంటి విధి నిర్వహణ యోధుల తోడ్పాటు ఈ కరోనా సమయంలో ప్రతి చోటా అవసరం. -
మాట్లాడితే రూపాయి నోట్ల దండలు
‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా తుపాకి పట్టుకుని గెరిల్లాగా పాల్గొన్న యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ తరువాత మహిళా నాయకురాలిగా, ఎమ్మెల్యేగా’ పనిచేసిన 86 ఏళ్ల స్వరాజ్యం జీవిత కథను ‘నా మాటే తుపాకి తూటా’గా(కవర్ పేజీలో పొరపాటుంది) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. దీన్ని విమల, కాత్యాయని కథనం చేశారు. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ: ‘‘మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’ ‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’ ‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు. నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ ‘‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’ నా మాటే తూపాకి తూటా మల్లు స్వరాజ్యం ఆత్మకథ; కథనం: విమల, కాత్యాయని; పేజీలు: 136; వెల: 120; ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్: 040–23521849 -
ఆతిథ్య రచయిత్రి
దక్షిణ భారతదేశంలోని వంటకాల్లో తమదైన విలక్షణత ఉంటుంది. ఇక్కడి వంటకాలలో ఎక్కువగా కొబ్బరి, రకరకాల మసాలాలు, పచ్చిమిర్చి, బియ్యం, కరివేపాకు, అల్లం వెల్లుల్లితో వండిన స్థానిక కూరగాయలు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు, ఒరుగులు వంటి ఎండబెట్టిన కరకరలాడే వంటకాలు.. ఎక్కువగా ఉంటాయి. ఒక రాష్ట్రంలోని ఆహారం మరొక రాష్ట్రాన్ని పోలకుండా ఉంటుంది. ఎవరి విలక్షణత వారిది. అంతెందుకు? ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఉత్తరాది ప్రాంతాలకు, దక్షిణాది ప్రాంతాలకు వంటల విషయంలో పూర్తి తేడా ఉంది. మంగళూరు ప్రాంతపు వంటలకి, కొడవ వంటకు, ఉడిపికి ఎంతో తేడా ఉంటుంది. ఇన్ని రకాల వైరుధ్యం గురించి చదివి తెలుసుకోవడానికి జీవితకాలం సరిపోదు. విమలా పాటిల్ రచించిన ‘‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’’ పుస్తకంలో పండుగ వంటలు, నిత్యం వండుకునే వంటకాల గురించి పూర్తిగా తెలుస్తుంది. దక్షిణాది వంటకాల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఇదొక గైడ్లాంటిది. భోజనంలో ఆప్యాయత విమల మంచి రచయిత, ఎడిటర్ కూడా. ప్రముఖ మహిళా పత్రిక ‘ఫెమినా’ను రెండు దశాబ్దాల కాలం పాటు ముందుండి నడిపారు. కళలు, విహారం, సాంఘిక అంశాలు, మహిళా విముక్తి వంటి రకరకాల అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. భారతీయ వస్త్ర పరిశ్రమను, చేనేతలను ప్రచారం చేయడం కోసం ప్రపంచపర్యటన చేశారు. ఇన్నిటికీ విలక్షణంగా వంటలకు సంబంధించి 12 పుస్తకాలు రచించారు. ‘ద వర్కింగ్ ఉమెన్స్ కుక్ బుక్, ఎంటర్‌టెయినింగ్ ఇండియన్ స్టయిల్, రెసిపీస్ ఫర్ ఆల్ అండ్ ఫాబ్యులస్ రెసిపీస్ ఫ్రమ్ ఇండియన్ హోమ్స్... వంటివి కొన్ని పుస్తకాలు.‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా’ పుస్తకంలో, దక్షిణాది వారి ఆప్యాయత, అభిమానం, ఆదరణల గురించి ప్రస్తావించారు. ‘వెండి పళ్లెం, కంచు కంచం, స్టీల్ కంచం, అరటి ఆకు, విస్తరాకు... ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి స్థితిగతుల మీద ఆధారపడి ఎందులో భోజనం పెట్టినా వారు చూపే ఆప్యాయతలో మాత్రం పేదధనిక తేడాలు ఉండవు... అని రాశారు ఈ పుస్తకంలో. తేలిగ్గా అర్థమయ్యేలా ‘ఎ కుక్స్ టూర్ ఆఫ్ సౌత్ఇండియా’ పుస్తకం స్పయిసీ బ్రింజాల్ కర్రీతో మొదలవుతుంది. తమిళనాడు విభాగం నుంచి, మసాలాలు గ్రైండ్ చేసిన వంటకాలను రుచి చూపించారు. ఈ పుస్తకంలో నూనె కొలతల దగ్గర నుంచి అన్నీ ఎంతో పద్ధతిగా రచించారు విమల. ఇందులో ప్రత్యేకంగా... ఎంతసేపు ఉడికించాలి అనేదానికి బదులుగా, ‘గ్రేవీ చిక్కబడేవరకు’ అని, ‘వంకాయలు సగం వేగేవరకు’ అని ప్రత్యేకంగా వివరించారు. ఇలా రాయడం వల్ల, ఆ వంటకంలో ప్రావీణ్యత సంపాదించడంతో పాటు, ఇతరులకు కూడా వంటకాన్ని తేలికగా వివరించగలుగుతారు.ఈ పుస్తకాన్ని ఆరు విభాగాలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, స్నాక్స్, స్వీట్స్. చివరి రెండు రకాలు కేవలం దక్షిణ భారత దేశానికి మాత్రమే చెందినవి కాదు. ఇందులో కొన్ని సరుకులకి (ఇంగ్రెడియంట్స్) ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో అనువాద పదాలు కూడా ఇచ్చారు. ఈ పుస్తకం దక్షిణాది భోజనం సంప్రదాయాన్ని పూర్తిగా వివరిస్తోంది. – జయంతి -
తెలంగాణ ప్రస్తుతం ప్యూడల్ చేతుల్లోకి పోయింది
-
విమల దేవోభవ
చదువు రావడం వేరు. బాగా రావడం వేరు. చదువు చెప్పడం వేరు, బాగా చెప్పడం వేరు. మంచి చదువు మంచి జీవితాన్ని ఇస్తుంది. అయితే అందరికీ మంచి చదువు అందుతుందా? అందేలా చేశారు విమలా కౌల్. తన చుట్టూ ఉన్న పేద పిల్లల కోసం స్వయంగా ఓ పాఠశాలే ప్రారంభించారు. విమలా కౌల్ పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. ఆమె హిస్టరీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్. ధన్‌బాద్‌లోని కార్మెల్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేశారు. రిటైర్మెంట్ తరువాత 1993లో ఢిల్లీకి మారిపోయింది వారి కుటుంబం. ఢిల్లీలోని సరితా విహార్‌లో ఉండేవారు. రోటరీ క్లబ్లో చురుగ్గా ఉండేవారు విమల, ఆమె భర్త. ఓసారి రోటరీ క్లబ్ సభ్యులు సరితా విహార్‌కు దగ్గరలో ఉన్న మదన్‌పూర్ ఖాదర్ గ్రామానికి వెళ్లి పిల్లలకు బిస్కెట్లు, ఇతర తినుబండారాలు పంచుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామంలోని ఓ పెద్దావిడ.. విమలాకౌల్ దగ్గరకు వచ్చి... ‘మీరు పిల్లలకు తినిపిస్తున్నారు మంచిదే, అలాగే వాళ్లకు తమ తిండి తాము సంపాదించుకునేదెలాగో నేర్పించండి’ అన్నది. ఆ పెద్దావిడ మాటలే తనలో ఆలోచనను రేకెత్తించాయంటారు విమలాకౌల్. ‘‘మేము ఏ పిల్లలకైతే తినుబండారాలిచ్చామో వారిని కూర్చోబెట్టి ఎవరు ఏయే క్లాస్‌లు చదువుతున్నారని అడిగితే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వాళ్లలో సరిగా బడికి పోతున్న వాళ్లు ఒక్కరూ లేరు. వెళ్తున్న వారిలో దాదాపుగా ఎవరికీ తప్పుల్లేకుండా ఒక వాక్యం రాయడం రాదు. ఇంగ్లిష్‌లోనే కాదు, సొంత భాష హిందీలో రాయడం కూడా రావడం లేదు. వాళ్లకు చదువు చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను’’ అంటారు విమల. మన పాఠశాల విద్యావ్యవస్థ నాన్ డిటెన్షన్ సిస్టమ్‌లో నడుస్తున్నందు వల్ల చదువు వచ్చినా రాకపోయినా హాజరు ఉంటే చాలు వారిని పాస్ చేసి పై తరగతులకు పంపిస్తారు. అలా ఎనిమిది, తొమ్మిదో తరగతుల పిల్లలు కూడా వారి క్లాస్ టెక్ట్స్‌బుక్ నుంచి ఒక్క లెక్కనూ సరిగ్గా చేయలేకపోవడాన్ని గమనించిన విమలాకౌల్... వారికి ఇంగ్లిష్, గణితం, సోషల్ స్టడీస్, పర్యావరణ శాస్త్రం బోధిస్తున్నారు. ఇందుకోసమే ఒక స్కూల్‌కూడా ప్రారంభించారు. మొదట చౌపాలిలో ఐదుగురు పిల్లలతో మొదలైంది ఆమె స్కూల్ ‘గుల్దస్త’ గుల్దస్త అంటే పుష్పగుచ్ఛం అని అర్థం. విమలాకౌల్ కోరుకున్నట్లే ఆ స్కూల్లోని పిల్లలు ఆమె శిక్షణలో పూల రెక్కల్లా విచ్చుకున్నారు. మరింత మంది పిల్లలకు చేరువలోకి తేవాలనే ఉద్దేశంతో స్కూల్‌ని తాము నివసిస్తున్న సరితా విహార్‌లోకి మార్చారు. కొద్దిరోజుల్లోనే 150 మంది చేరారు. ఇంట్లోనే నడపవచ్చనుకున్న స్కూలుని కాలనీ బయటకు తీసుకెళ్లక తప్పని స్థితి వచ్చింది విమలాకౌల్‌కి. ఇంతమంది పిల్లల గోల భరించలేకపోతున్నామని ఆరోపించారు ఇరుగుపొరుగు వాళ్లు. ఒకావిడ అయితే ఏకంగా వాళ్ల ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. స్థానిక కమ్యూనిటీ సెంటర్లో పాఠాలు చెప్పాలంటే కమిటీ సభ్యులు ససేమిరా అన్నారు. ఇక చేసేదేమీ లేక కాలనీ పార్కులో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ కూడా అదే సమస్య. ఆ పరిసరాల్లోని ఇళ్లవాళ్ల నుంచి మళ్లీ అభ్యంతరాలు. అలా మూడు పార్కులు మారారు. చివరికి మున్సిపల్ పార్కులో దాదాపుగా పదేళ్లకు పైగా స్కూలు నడిచింది. ఎండలకు, ఢిల్లీ చలికి తగినట్లు ఆయా కాలాల్లో టైమింగ్స్ మారుస్తూ క్లాసులు నిర్వహించేవారు విమలా కౌల్. ఆమె శ్రమ చూసిన మదన్ మోహన్ మాలవ్యా మిషన్ ఎన్జీవో 2011లో స్కూలుని దత్తత తీసుకుంది. అప్పటి నుంచి స్కూలు నాలుగు గదుల అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇన్ని కష్టాలు పడుతూ సాగినప్పటికీ ఆమె శిక్షణలో పిల్లలు చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. గుల్దస్తలో చదువుకున్న అరవై మంది విద్యార్థులు ప్రాథమిక విద్య తర్వాత మంచి స్టాండర్డ్ ఉన్న స్కూళ్లలో సీటు తెచ్చుకోగలిగారు. ఆ స్కూళ్లలో క్లాస్ టాపర్లుగా నిలుస్తున్నారు కూడా. తాను నాటిన మొక్క పేదరికం కారణంగా ఎవరి బాల్యమూ వసివాడిపోకూడదని, సరైన మార్గదర్శనం లేకపోవడం కారణంగా పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారకూడదనేది విమలాకౌల్ ఆకాంక్ష. స్కూలు ప్రారంభించిన తరవాత పదిహేనేళ్లకు అంటే... 2009లో విమలా కౌల్ భర్త హరిమోహన్ కౌల్ మరణించారు. (ఆయన బిట్స్‌పిలానిలో ఇంజనీరింగ్ చదివి, ఇండియన్‌స్కూల్ ఆఫ్ ధన్బాద్లో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. స్కూలు నిర్వహణలో విమలా కౌల్‌కి సహాయంగా ఉండేవారు). అయితే భర్త పోవడం వల్ల తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని కూడా పిల్లలతోనే భర్తీ చేసుకున్నారామె. అప్పటి నుంచి ఆమెలో కొత్త ఆలోచన మొదలైంది. ఎవరు ఉన్నా లేకపోయినా... తాను నాటిన గుల్దస్త మొక్క వాడిపోకూడదు.. అనుకున్నారు. అందుకోసం 2012లో ఎన్జీవో వసుంధరి సొసైటీ ఫర్ సోషల్ యాక్షన్ ప్రారంభించారు. ఇప్పుడు ఆ స్కూలు వసుంధరి– మదన్ మోహన్ మాలవ్యా సంస్థ సంయుక్తంగా నిర్వహణలో ఉంది. ఆత్మీయతే ఆదుకొంది విమలాకౌల్‌కి ఈ పాతికేళ్లలో స్కూలు నిర్వహణలో ఎదురైన సవాళ్లన్నీ ఒక ఎత్తయితే... 2000 సంవత్సరం మరీ గడ్డుకాలం. తాను వేతనం లేకుండా పని చేస్తుంది, కానీ ఇతర ఖర్చులు తప్పడం లేదు. విద్యార్థులు పెరిగే కొద్దీ టీచర్ల సంఖ్య పెరగక తప్పదు. వారికి వేతనాలివ్వాలి. తన దగ్గరున్న డబ్బు ఖర్చయిపోయింది. దాంతో స్కూలు మూసేయక తప్పదనే నిర్ణయానికి వచ్చారామె. ఇంకా సర్వీస్ చేయాలంటే తాను ఒక్కర్తెగా చెప్పదగినంత మందికి పాఠాలు నేర్పించడం ఒక్కటే తన ముందున్న మార్గం అనుకున్నారామె. స్కూలు మూసేస్తానని ప్రకటించారు కూడా. ఒక మంచి పనికి సమాజంలో ఆదరణ ఉంటుందని నిరూపణ అయిన సమయమది. ఆమె ఆ మాట అన్నారో లేదో వెంటనే... ఆమె స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు ముందుకొచ్చారు. స్కూలు మూత పడకుండా విరాళాలతో ఆదుకున్నారు. ఆర్డర్ ఇవ్వకనే ఆహారం వచ్చింది గుల్దస్త్ విద్యార్థుల్లో ఒకమ్మాయి ఇప్పుడు అదే స్కూల్లో టీచర్‌గా చదువు చెప్తోంది. ఒక కుర్రాడు కంప్యూటర్స్‌లో డిగ్రీ చేసి అదే స్కూల్లో కంప్యూటర్ కోర్సు నేర్పిస్తున్నాడు. మరో కుర్రాడు మెకానిక్‌గా మంచి సంపాదనతో స్థిరపడ్డాడు. వీరందరికంటే విమలాకౌల్ను భావోద్వేగానికి గురి చేసిన ఓ స్టూడెంట్ ఉన్నాడు. అతడు చైనీస్ రెస్టారెంట్లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఓ రోజు ఆమె రెస్టారెంట్‌కెళ్లింది, ఆమె ఆర్డర్ చేసే లోపు ఆహారం వచ్చింది. ‘మా సార్ పంపించారు’ అని ఆమె ముందు పెట్టి వెళ్లిపోయాడు సర్వర్. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ భోజనం పూర్తి చేశారామె. బిల్లు అడిగినప్పుడు ‘మేడమ్ నేను కట్టేశాను’ అంటూ బయటికొచ్చాడో కుర్రాడు. వచ్చీ రాగానే ఆమె పాదాలను తాకి నమస్కరించాడు. అతడు ఒకప్పటి ఆమె స్టూడెంట్. ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకుంటూ.. ‘నేను రిటైరైన తర్వాత సమాజానికి ఏదైనా చేయాలని గ్రామాలు, మురికి వాడల్లో తిరుగుతున్నప్పుడు మదన్‌పూర్‌లోని ఒక పెద్దావిడ ‘వాళ్ల తిండి వాళ్లు సంపాదించుకునేటట్లు తయారు చెయ్యి’ అని నాకు చెప్పింది. ఆ మాటల స్ఫూర్తితోనే సరిగ్గా చదువురాని పిల్లలను చేరదీసి చదువు చెప్తున్నాను. నా దగ్గర అక్షరాలు దిద్ది, నీ తిండి నువ్వు సంపాదించుకోవడమే కాకుండా, చదువు చెప్పిన గురువుకి అన్నం పెట్టేటంత పెద్దవాడివయ్యావు’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారామె. తాను నాటిన మొక్క వృక్షమయ్యాక ఆ నీడన సేదదీరుతున్నంత ఆనందం ఆమె కళ్లలో అప్పుడు! వారి జీవితాలు గాడిన పడ్డాయి! ‘‘నేను చదువు చెప్తున్న పిల్లల అభ్యున్నతే నాకు గొప్ప రివార్డు. ఇక ఇతర అవార్డులెందుకు? నా పిల్లలు ఎందరో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లలో ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన పిల్లల్లో చాలామందిలో అసాధారణమైన తెలివితేటలుండేవి. వారికి సరైన మార్గదర్శనం చేస్తే జీవితాలు గాడిన పడతాయని నమ్మాను. వారంతా నేను కోరుకున్నట్లే వికసించారు. పేద పిల్లలకు చదువు చెప్పాలనుకున్న రోజు... ‘ఈ ప్రయత్నంలో ఒక్కరి జీవితమైనా బాగుపడితే నా జన్మ ధన్యమవుతుంద’నుకున్నాను. ఇన్నేళ్లలో ఎంతోమంది పిల్లలకు బాల్యాన్ని ఇవ్వగలిగాను. వారికి భవిష్యత్తు దారి చూపించగలుగుతున్నాను. అదే నాకు సంతోషం’’. – విమలాకౌల్, అవిశ్రాంత ఉపాధ్యాయురాలు వీళ్లందరూ నా పిల్లలే! విమలాకౌల్ వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులేవీ లేకుండా సాగిపోయింది. సమాజం కోసం జీవించాలని, సమాజానికి ఏదైనా చేయాలని మొదలు పెట్టిన ప్రయత్నంలో లెక్కకు మించిన ఆటంకాలు ఎదురయ్యాయి. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే ఆమె విజయరహస్యం. లోకసభ టీవీ, సిఎన్ఎన్ ఐబిఎన్, బీబీసీ చానెళ్లు ఆమె సేవలను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. అవార్డులు కూడా ఇచ్చాయి. ఆమెకు పిల్లల్లేని విషయాన్ని గుర్తు చేసినప్పుడు చిరునవ్వుతో ‘‘వీళ్లంతా నా పిల్లలే కదా’’ అంటారామె క్లాసులోని పిల్లలను చూపిస్తూ. ‘రోజంతా వీరి మధ్యనే సంతోషంగా గడుపుతాను. ఇక నాకు ఎవరూ లేరని ఎందుకనుకుంటారు’ అని తిరిగి ప్రశ్నిస్తారు. – వాకా మంజులారెడ్డి -
ఊరు మెచ్చిన కోడలు
‘‘ఏమిటీ? దాన్ని ఇంట్లోనా?’’ ముఖం చిట్లించిందొకామె. ‘‘దేవుడి గది, వంటగదితోపాటు అది కూడా ఇంట్లోనేనా,భగవంతుడా!’’ మరొకామె. ‘‘ఇల్లు దాటి పదడుగులు వేస్తే పొలాలే.కావల్సినంత ఖాళీ ఉంది. చెట్ల మరుగుఉంది. మా ఊరికి దాంతో పనిలేదు’’ఇంకొకామె. ‘‘చెరువు గట్టున చేయాల్సినపని ఇంట్లోనా, ఛీఛీ’’ మరో పెద్దాయన.‘దేవుడా, వీళ్లకు ఎలా చెప్పాలి?! తామెలాంటి స్థితిలో జీవిస్తున్నదీ వీళ్లకు తెలియడం లేదసలు’.. ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంది విమలా కాదమ్. మరుసటి రోజు ఎప్పటిలాగానే కాలేజ్‌కి వెళ్లింది విమల. తన ఫ్రెండ్స్ పాతికమందికి ఈ సంగతి చెప్పింది. అంతా అంగీకరించారు. ఇంటికి వచ్చి మూడు ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసింది. ఆ ప్రశ్నలివి.. ‘గడచిన ఐదేళ్లుగా గ్రామంలో పాముకాటు మరణాలెన్ని? అవి ఎప్పుడు జరిగాయి?’‘ఆడవాళ్ల మీద అఘాయిత్యాలెన్ని? ఎప్పుడు?’‘నీటి కాలుష్యం కారణంగా వానలు కురిసినప్పుడు రోగాల పాలయిన వాళ్లెందరు?’ఆ తర్వాత విమలా కాదమ్ తన ఫ్రెండ్స్ బృందాన్ని ఊళ్లో దించింది. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్ల మీద వాలిపోయారు. ఇంట్లో వాళ్ల మీద ఈ మూడు ప్రశ్నలతో దాడి చేశారు. చెరువు గట్టునే చేటు! బలాత్కారాలు, పాము కాట్లన్నీ బహిర్భూమి కోసం పొలాల్లోకి, చెట్ల మరుగుకు వెళ్లినప్పుడే జరిగాయని బదులిచ్చారు గ్రామస్థులు. ఇక నీటి కాలుష్యం వల్ల వచ్చిన అనారోగ్యాలకైతే లెక్కే లేదు. వానాకాలంలో అతిసార వంటి రోగాల రూపంలో ప్రాణాలు తీస్తున్నది చెరువు గట్టు ‘వాడకమే’నని వారికి తెలియజెప్పారు స్టూడెంట్స్. గ్రామస్థులను చైతన్యవంతం చేయడానికి జరిగిన ఈ దాడిలాంటి ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చే సూచనలు కనిపించాయి. వేడెక్కిన ఇనుము చల్లబడక ముందే దానిని మలుచుకోవాలి. ఇక అందరికీ నచ్చ చెప్పే పని మొదలైంది. దేవుడి పూజ గది ఉన్నంత మాత్రాన ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉండకూడదనే అపోహను మొత్తానికి వారు తుడిచేయగలిగారు. ‘దీపం’ ఉండగానే ఆలోచన విద్యార్థులను చూసి గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. ‘‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టించాలని ప్రభుత్వ ఆదేశం. నిధులు కూడా దండిగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికంటే ముందే ఎవరికివారే మరుగుదొడ్డి కట్టించుకున్న ఇరవై శాతం మంది మినహా స్వచ్ఛభారత్ ప్రయత్నంలో ఒక్క దొడ్డిని కూడా కట్టించలేకపోయాం. ఈ చైతన్యోద్యమంలో మేమూ నడుస్తాం’ అని ఆ పెద్దలు చొరవ చూపారు. తమ వంతుగా ఇంటికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల డబ్బు ఇచ్చారు. స్కీమ్ ఉండగానే కట్టించుకోవడం మేలని గ్రామస్థులు కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. మరో ఆరు మిగిలే ఉన్నాయి నాలుగు వేల ఐదొందల జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు 800 మరుగుదొడ్లు ఉన్నాయి. మరో వంద మంది కూడా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ గ్రామం పేరు ఉమ్రాని. కర్ణాటక రాష్ట్రం, చిక్కోడి తాలూకాలో ఉంది. విమల కాదమ్ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అక్కడి అధికారులకు ఆమె ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోందిప్పుడు. ‘‘మరో ఆరు గ్రామాలు ఇలాగే కొరకరాని కొయ్యలుగా మిగిలి ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్లి వాళ్లకూ చెప్పండి ప్లీజ్’ అని రిక్వెస్ట్ చేశారు తాలూకా ఆఫీసర్. పరీక్షలై పోయిన తర్వాత తన ‘చైతన్య యాత్ర’ ప్రారంభించబోతోంది విమలా కాదమ్. ►అధికారులు చెయ్యలేని పనిని కళాశాల విద్యార్థిని విమలా కాదమ్ చేయగలిగింది! మరుగుదొడ్డ నిర్మాణానికి మొరాయించిన గ్రామస్థుల మనసును ఆమె మార్చగలిగింది. ►కర్ణాటక, హుబ్లీలో ఇటీవల జరిగిన యువ సదస్సులో విమలా కాదమ్ ‘బెస్ట్ లీడర్ 2018’ అవార్డు అందుకున్నారు. అయితే ఆమె తనను గోప్యంగా ఉంచుకోడానికే ఇష్టపడడంతో సదస్సు నిర్వాహకులు మీడియాను ఫొటోలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ►మరుగుదొడ్ల నిర్మాణం కోసం విమలా కాదమ్ నేతృత్వంలో గ్రామస్థులలో చైతన్యం తెచ్చేందుకు బయల్దేరిన సహ విద్యార్థులు. ►అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలోని ఒక సన్నివేశం: ఈ చిత్రంలో చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో విమలా కాదమ్కు నిత్యమూ కనిపించేవట. ‘ఇదా! నా మెట్టినూరు!!’ విమలా కాదమ్ 2016లో పెళ్లి కారణంగా చదువును మధ్యలో ఆపేసింది. పెళ్లి తర్వాత మళ్లీ చదువుకోవడానికి అత్తగారింటికి దగ్గరలో చిక్కోడి తాలూకాలో ఉన్న ఎ.ఎ.పాటిల్ ఉమెన్స్ కాలేజ్‌లో చేరింది. అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలో ఆమె చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో నిత్యమూ కనిపించేవి. ఓసారైతే వయసు మళ్లిన మహిళలు ముధోల్– నిప్పని స్టేట్ హైవే దగ్గర బారుగా నిలబడి ఉన్నారు. రోడ్డు దాటితే అంతా ఖాళీ పొలాలే. వాళ్లు వెళ్తున్నది టాయిలెట్ అవసరం తీర్చుకోవడానికి అని తెలిసి నివ్వెరపోయింది విమల. తాను కోడలిగా వచ్చింది ఇలాంటి ఊరికా అనిపించింది ఆమెకు. ఏదో ఒకటి చేసి తీరాలనుకుంది. అనుకున్న పని చేసి చూపించింది. దాంతో ఊరు స్వచ్ఛ గ్రామంగా మారింది. విమల ఊరు మెచ్చిన కోడలు అయింది. ఇటీవలే ఆమె హుబ్లీలో జరిగిన 8వ ‘యువ సదస్సు’లో ‘బెస్ట్ లీడర్ (ఇన్ కమ్యూనిటీ ఇంపాక్ట్) 2018’ అవార్డు అందుకుంది. – మంజీర -
కేసీఆర్ కుటుంబంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన రెండో సోదరి విమలా బాయి(82) బుధవారం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయమే కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. విమలా బాయి కుటుంబం హైదరాబాద్ అల్వాల్‌లో మంగాపురం కాలనీలో నివసిస్తున్నారు. అల్వాల్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న. ఇప్పుడు చనిపోయిన విమల రెండో సోదరి. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. కేసీఆర్ రెండో సోదరి విమలా బాయి -
‘బీచ్ లవ్’ను అడ్డుకుంటాం
మహిళలు, యువత మండిపాటు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించతలపెట్టిన ‘ప్రేమోత్సవం’పై మహిళలు, యువత భగ్గుమంటున్నారు. గురువారం ‘సాక్షి ’లో ప్రచురితమైన ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ కథనంపై విద్యార్థి, మహిళా సంఘాల నేతలు స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధి పేరిట విదేశీ జంటలతో లవ్ ఫెస్టివల్ నిర్వహించడాన్ని అంగీకరించబోమన్నారు.విరమించని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని, ఐక్య కార్యాచరణతో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇది మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.విమల దుయ్యబట్టారు.దీనిపై ప్రభుత్వానికి మహిళాలోకమంతా తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ బికినీలతో మహిళలను చూపడం దారుణమని విమర్శించారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా...
కరీంనగర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. విమల అనే మహిళ ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతోంది. అదే క్రమంలో చేతిలోకి ఫోన్ తీసుకుని తరిచి చూస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. -
ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి
విజయనగరం: ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి చెందిన సంఘటన దెంకాడ మండలం సింగవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంకుడు గుంతలో పడి విమల(6), తేజ(6) అనే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 'నీరు-చెట్టు' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్వించింది. అరదులో భాగంగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో సుమారు 10 అడుగుల లోతు గుంత తవ్వించారు. ఇటీవల వర్షాలకు గుంత నిండా నీళ్లు చేరాయి. ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారులు కనిపించక పోయేసరికి తల్లిదండ్రులు వెతకటం ప్రారంభించారు. చిన్నారులు ఇంకుడు గుంతలో విగతజీవులై ఉండటం గమనించి తల్లిదండ్రులు దిగ్భాంతికి గురయ్యారు. (దెంకాడ) -
'మోక్షజ్ఞ కేసు'లో కొత్త మలుపు
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞ తేజ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తండ్రి, కుటుంబ సభ్యులే చిన్నారిని చంపి ఉంటారని మోక్షజ్ఞ తల్లి విమల ఆరోపించారు. తన భర్త భాస్కరరావుకు జాతకాల పిచ్చి ఉందని విమల చెప్పారు. మోక్షజ్ఞ తండ్రికీడుతో పుట్టాడని జాతకం చెప్పారని వివరించారు. మోక్షజ్ఞ హత్య వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుందని విమల సందేహం వ్యక్తం చేశారు. జాతకాల పిచ్చితో తన భర్తే తండ్రి చంపి ఉండొచ్చని విమల అన్నారు. విజయవాడ సమీపంలో కనకదుర్గమ్మ వారిధి పై నుంచి మోక్షజ్ఞను కృష్ణానదిలోకి విసిరి చంపేసిన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి ఏడాదిన్నర వయస్సుగల చిన్నారిని తెనాలిలో ఉంటున్న సొంత బాబాయి గోడపాటి హరిహరణ్ కృష్ణానదిలోకి విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. మోక్షజ్ఞ తల్లిదండ్రులు విమల ప్రియ, భాస్కరరావు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వీరిద్దరూ మోక్షజ్ఞ తేజను ఆరు నెలల కిందట తెనాలిలో ఉంటున్న తాతయ్య, నానమ్మ రాంబాబు, జానకిల వద్ద వదిలి వెళ్లారు. -
మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ప్రభుత్వానికి ‘ముక్త’ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ మహిళల అధ్యయన వేదిక ‘ముక్త’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యాచారాలు, వేధింపులు.. మహిళల సమస్యలకు పరిష్కార మార్గాలపై అధ్యయ నం చేసి ‘ముక్త’ రూపొందించిన నివేదికను గురువారం రాష్ట్ర మహిళా భద్రత కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్యకు సంస్థ ప్రతినిధులు అందజేశారు. నిరక్షరాస్యత, పసలేని పాఠ్యాంశాలు, కుంటుపడుతున్న బాలికావిద్య, మహిళలను అపహరించి విక్రయించడం, స్కూళ్లు, హాస్టళ్లలో వసతులు వంటి అంశాలను నివేదికలో ప్రస్తావించారు. నివేదిక ప్రతిని సీఎం కార్యాలయంలో కూడా అందజేశారు. చైర్‌పర్సన్‌ను కలిసినవారిలో ‘ముక్త’ అధ్యక్షురాలు విమల, ప్రధానకార్యదర్శి కిరణ్‌కుమారి, టి.దేవకీదేవి, వసుధ, కె.శైలజ, శోభ, నకాషి ఉన్నారు. -
ఎటూ తేలని 'చిన్నారి' పంచాయితీ
ఇద్దరు తల్లుల నడుమ నలిగిపోతున్న 2 సంవత్సరాల చిన్నారి పంచాయితీ ఎటూ తేలకపోవడంతో స్త్రీ శిశుసంక్షేమ శాఖాధికారులు శుక్రవారం బిడ్డను బుద్ధవరంలోని చైల్డ్కేర్సెంటరుకు అప్పగించారు. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న చిన్నారి వివాదం ముదిరిపాకాన పడడంతో తిరువూరు పోలీసుస్టేషనులో గురువారం పంచాయితీ చేసిన విషయం విదితమే. అయితే చిన్నారి కోసం కన్నతల్లి హేమలత, పెంచిన తల్లి విమల ఎవరికి వారే పట్టుదలకు పోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని ఐసీడీఎస్ సీడీపీవో అంకమాంబను కోరారు. దీంతో ఇరువురి వాదనల్లో నిజమెంతో తేలేవరకు ఆ బిడ్డను చైల్డ్ కేర్ సెంటరుకు అప్పగించామని సీడీపీవో అంకమాంబ తెలియజేశారు.కాగా చైల్డ్‌కేర్ సెంటరుకు బిడ్డను అప్పగిస్తారని తెలియడంతో హేమలత, విమలల మధ్య రాజీకుదర్చడానికి కొందరు పెద్దలు చేసిన ప్రయత్నం విఫలమయింది. పత్తాలేని మధ్యవర్తులు... హేమలత బిడ్డను పెంచుతామని డబ్బులు తీసుకున్న తిరువూరుకు చెందిన విజయనాధం అనే వ్యక్తి కనిపించకపోవడంతో సమస్య జఠిలమైంది. విజయనాథం నుంచి ఆ బిడ్డను తీసుకున్న మరో వ్యక్తి తన సమీపబంధువైన విమలకు సంతానం లేకపోవడంతో పెంపకం నిమిత్తం అప్పగించారు. అయితే తాము పెంచుకుంటున్న పాపను విక్రయించడానికే హేమలత మళ్లీ వివాదం సృష్టిస్తోందని విమల ఫిర్యాదులో పేర్కొంది. పాపం పసిపాప.... ఆ పాపకు తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తనను అల్లారు ముద్దుగా పెంచుతున్న వారితో బోసినవ్వులు నవ్వుతూ, నవ్విస్తూ 19 నెలలు గడిపింది. దేవుడిచ్చిన వరంగా భావించిన ఆ దంపతులు ఈ పాపను అపురూపంగా పెంచుకున్నారు. విధి ఎంత విచిత్రంగా ఉంటుందటే ఆ పాపతో పాటు పెంచుకుంటున్న వారిలోనూ వేదన మిగిల్చింది. పాప తన కూతురంటూ వచ్చిన తల్లిలోనూ అదే వేదన మిగిలింది. ఈ పాపను ఎవరి వద్ద ఉంచాలనేది అధికారులతో పాటు ఎవరూ తేల్చి చెప్పలేని పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందంటే.... నాలుగేళ్ల క్రితం తిరువూరుకు చెందిన బల్లిపర విజయనాధంకు నెల్లూరుకు చెందిన హేమలత చెన్నైలో పరిచయం అయింది. ఆమె వద్ద ఉన్న తొమ్మిది నెలల కుమార్తెను విజయనాధంకు ఇచ్చి కనిపిచకుండా పోయింది. విజయనాధం ఆ పాపను తిరువూరులోని గద్దల సందీప్, విమల దంపతులకు ఇచ్చాడు. వీరికి నాలుగేళ్ల క్రితం పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. విజయనాధం ఈ పాపను ఇవ్వడంతో దేవుని ప్రసాదమని భావించి తీసుకున్నారు. నా బిడ్డను నాకివ్వండి... పందొమ్మిది నెలల్లో రెండుసార్లు హేమలత విమల దంపతుల వద్దకు వచ్చింది. తన కుమార్తెను తనకు ఇవ్వాలని కోరింది. అయితే వారు ఆమె కోరికను తిరస్కరించారు. నాలుగు నెలల క్రితం మరోసారి వచ్చిన హేమలత ఇలాగే అడిగి వెళ్లిపోయింది. అయితే వారం రోజుల క్రితం తిరువూరు వచ్చి తన కుమార్తెను తనకు ఇవ్వాలంటూ గొడవ చేసింది. దీంతో విమల దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పంచాయితీ ఎటూ తేలకపోవడంతోనూ, కన్నతల్లినని చెప్పుకుంటున్న హేమలత వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాపను పోలీసులు ఐసీడీఎస్ వారికి అప్పగించారు. -
కవిత: పావురం కళ్లు
మెల్లిగా లోకం పై వెలుతురు పరుచుకునేవేళ ఎక్కడి నుంచి వచ్చి వాలుతుందో ఒక తెల్లటి పావురం నా కిటికీ మీద అప్పుడు నేను నా విచారాల్ని, సంతోషాల్నీ తెల్లటి కాగితంపై అక్షరాలుగా చల్లుతూ ఉంటాను అద్దం పై నిలిచిన నీళ్లలా అవి నన్ను ప్రతిబింబిస్తూ కవిత్వంలా రూపుదిద్దుకోవడాన్ని చూస్తుంటాను కిటికీ గాజు తలుపుల్ని ముక్కుతో కొడుతూ పావురం పిలుస్తుంది నన్ను పావురాలు కవిత్వం కన్నా గొప్పవి కావన్న అతిశయంతో దాన్ని ఎన్నడూ పట్టించుకోను ఎన్నో ఏళ్లుగా అది వదలకుండా అట్లా నన్ను పిలుస్తూనే ఉంది చివరకి తలెత్తి చూస్తే దాని చిన్ని నక్షత్రాల్లాంటి కళ్లలో అనిర్వచనీయ జీవ కవిత్వపు జాడలు కదలాడుతూ నన్ను పలకరిస్తాయి అప్పుడు కాగితంపై నేను చల్లిన అక్షరాలన్నీ హటాత్తుగా మాయమై ఎటో ఎగిరిపోయాయి అనాదిగా కవులు రాసిన కవిత్వాలన్నీ పావురాలై ఆకాశంలోకి ఎగిరిపోయాయేమో అందుకేనేమో అవి అట్లా రెక్కల్ని విప్పి రెండు ఆలీవ్ కొమ్మల్ని పట్టుకొని స్వేచ్ఛా కాంక్షని, శాంతి సందేశాన్ని మోస్తూ లోకం అంతటా ఎగురుతున్నాయి పావురం కళ్లలోని దయకన్నా ఎవరి కవిత్వం గొప్పది చెప్పు? - విమల -
దూరంగా ఉన్నా... దగ్గర కావచ్చు!
పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అది ఆనందంతో పాటు ఎన్నో సందేహాలను, భయాలను, కన్ఫ్యూజన్లను తీసుకొస్తుంది. నాపెళ్ళి సమయంలో నేను కూడా వీటన్నిటితో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. పెళ్ళి తర్వాత నాజీవితం ఎలా ఉంటుందో... నాభర్త నన్ను అర్థం చేసుకుంటారో లేదోనన్న భయం... అక్కడ అడ్జస్ట్ అవగలనో లేదోనన్న సందేహం, అక్కడి వాళ్ళ మసస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియక కన్ఫ్యూజన్ కలిసి నన్ను కుదరుగా ఉండనివ్వలేదు. ఏదైతేనేం... వెంకట్ గారితో నా పెళ్ళి జరిగిపోయింది. నేను చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం కూడా అంతే వేగంగా అయిపోయింది. వెంటనే హనీమూన్, చుట్టాలింటికి భోజనాలకు వెళ్ళడాలు వంటి వాటితో ఓ నెల రోజులు ఊపిరాడలేదు. ఆ తర్వాత మొదలైంది అత్తారింటిలో అసలైన జీవితం. మా అత్తగారు మంచిదే. కానీ ఆవిడ చెప్పింది చెప్పినట్టు పాటించాల్సిందే! లేదంటే చాలా ఫీలైపోయి ముఖం మాడ్చుకుని కూర్చునేది. ఏంటలా ఉన్నావని పొరపాటున ఏ కొడుకో అడిగాడా... ‘మీ నాన్న పోవడంతోనే నా విలువ పోయింది’ అంటూ ముక్కు చీదేది. దాంతో కొడుకులు కరిగిపోయేవారు. కట్ చేస్తే ఏముంది... ‘అమ్మను అర్థం చేసుకోండి, ఆమెను బాధపెట్టకండి’ అంటూ మాకు క్లాసులు. వంటదగ్గర్నుంచి ప్రతి విషయం గురించీ ముందే ఆజ్ఞలు జారీ చేసేసేది. ఆమె ఏది వండమంటే అదే వండాలి. ఇంట్లో లేదు కదా అని మరొటి వండితే ఇక అంతే సంగతులు. ఏదో పెద్దావిడలే అని సరిపెట్టేసుకునేదాన్ని. కానీ నా భర్తకు, నాకు ప్రైవసీ లేకపోతే మాత్ర చాలా బాధ కలిగేది. ఆయన నాకు చీర కొనుక్కొచ్చినా మొదట ఆవిడే చూడాలి. ఓసారి ఆయన అలా చూపించకుండా ఇచ్చారని నానా యాగీ చేసింది. పోనీ చూపిస్తే ఆనందపడేదా అంటే అదీ లేదు. దాంతో మా వారు పూలు తేవడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. నా మనసు చివుక్కుమనేది. మా తోడికోడళ్ళు కూడా అదోలా ప్రవర్తించేవారు. వాళ్ళకూ నా మీద కోపమేమీ లేదు. కానీ అత్తగారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపించేవారు. వాళ్ళ పనులు నా మీద రుద్దడం, ఏదైనా తేడా జరిగి అత్తగారు కోప్పడితే నా మీద తోసెయ్యడం, మావారు నేనూ సన్నిహితంగా ఉంటే సెటైర్లు వేయడం చేసేవారు. ఓ ఆరునెలలు ఇవన్నీ భరించానుకానీ ఓరోజు నా ఓపిక నశించిపోయింది. ఆరోజు నా అపాయింట్మెంట్ ఆర్డర్‌ని మా ఇంట్లో చూపించాను. దాంతో చిన్నపాటి యుద్ధమే చెలరేగింది. తమకు మాట మాత్రమైనా చెప్పలేదని తోడికోడళ్ళు, అసలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని అత్తగారు అనేసరికి నాకు తిక్కరేగినట్టైంది...‘‘నేను ఎంబీయే చేశాను, నాతెలివితేటల్ని, చదువుని వృథా చేసుకోలేను, అయినా నాభర్త ఒప్పుకున్నారు’’ అని అనేసరికి అత్తగారు భద్రకాళి అయ్యారు. ‘అంతా నీ ఇష్టమేనా, అంత పెద్దవాడివైపోయావా!’ అంటూ మావారి మీద కేకలేశారు. నన్ను అమితంగా ఆశ్చర్యపర్చిన విషయం... మావారు నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కమాట కూడా మాట్టాడకపోవడం. తర్వాత నా దగ్గరకు వచ్చి, అమ్మకిష్టం లేదు కదా, ఉద్యోగం సంగతి మరోసారి ఆలోచించు అనడం.ఇక నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందని నాకు అర్థమైంది. మావారికి ఒకటే చెప్పాను. ‘నాకు మీ అమ్మగారు. అన్నా వదినలు ముఖ్యమే... కానీ అంతకంటే ముందు మీరు, నాభవిష్యత్తు ముఖ్యం, మీరు నాభవిష్యత్తుగా తోడుగా ఉంటారా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆయన కాస్త ఆలోచించే మనిషే. అందుకే నన్నేమీ అనలేదు. అలాగని ఎస్ కూడా చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. నేను తనతో చెప్పాను...‘‘దగ్గరగా ఉండి స్ఫర్థలు పెంచుకుంటున్నాం. దూరంగా ఉండే ప్రేమలు పెంచుకుందాం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏమన్నా నేను సహించాను, కానీ నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే దూరంగా ఉండి మన బతుకు మనం బతుకుదాం, కానీ మీ వాళ్లకు మాత్రం దూరం కావద్దు, వాళ్ళ పట్ల అన్ని బాధ్యతలూ నెరవేరుద్దాం’’ అన్నాను. మావారు మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అత్తగారు మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన అన్నలు, వదినలు మమ్మల్ని సపోర్ట్ చెయ్యలేదు. కానీ మేం అనుకున్న అడుగు వేశాం. అక్కడికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాం. వారు న్ను ప్రోత్సహించి నాక్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా జీతంలో సగభాగం ప్రతినెలా తీసుకెళ్ళి అత్తగారికిచ్చాను. పండుగలకి, పబ్బాలకి అందరికీ బట్టలు కొన్నాను. ఇంట్లో ఏ పూజనీ, శుభకార్యాన్నీ మిస్ కాలేదు. అత్తమ్మ మందుల దగ్గర్నుంచి తోడికోడళ్ళ పిల్లల పుట్టినరోజుల వరకూ దేన్నీ మర్చిపోలేదు. దాంతో మొదట కోపంగా ఉన్నవారు మెల్లగా నాకు చేరువయ్యారు. నామనసులో ఏ దురద్దేశం లేదని అర్థం చేసుకున్నారు. చనిపోయేవరకూ మా అత్తగారు అందరికీ చెప్పేవారు...‘మా చిన్నకోడలు భలే పిల్లండీ, నేనెంత అదృష్టవంతురాలినో’ అని. నేనారోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మనస్ఫర్థలతో మా మధ్య దూరాలు పెరిగిపోయి ఉండేది. మా వాళ్ళకూ నాకూ మధ్య పెద్ద ఆగాథం ఏర్పడి ఉండేది. నా మీద కోపంతో వాళ్ళు ... నా ఆశలు తీరలేదన్న అసంతృప్తితో నేనూ బతకాల్సి వచ్చేది. అలాగని అందరూ వేరు కాపురాలు పెట్టాలని అనడం లేదు. కానీ మీ స్పేస్ మీకు అవసరం అనిపించినప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దని మాత్రం చెబుతాను. అది తప్పు కాదు. ఒక్కోసారి దూరం ప్రేమల్ని, బంధాల్ని బలపరుస్తుందే తప్ప తగ్గించదు. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ. - విమల, ముమ్మిడివరం, తూ.గో.జిల్లా మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే మాకు రాసి పంపించండి. బంధాలను బలపరచుకోవడానికి, అనుబంధాలను పదిలపరచుకోవడానికి మీ అనుభవాలు మరికొందరికి దారి చూపవచ్చు. మా చిరునామా: అస్త్ర, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్,హైదరాబాద్ - 500034, మెయిల్: sakshi.asthra@gmail.com -
మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా?
నా వయసు 22. నాకిది మొదటికాన్పు. నెల రోజుల తర్వాత ప్రవసం కానుంది. నవజాత శిశువునకు తల్లిపాలు పట్టడం ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం తాగించాలి? అవి సమృద్ధిగా రాకపోతే బయటిపాలలో ఏవి మంచివి? నాకు మంచి సలహా ఇవ్వగలరు. - విమల, వనస్థలిపురం ప్రసవసమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం గుర్తుంచుకోవాలి. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతినివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం సఫలమవుతుంది. తనకెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు. అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా ఒకటి. ముర్రుపాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా అయ్యేట్టు చేస్తాయి. బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చేవరకు స్తన్యం తాగించాలి. ఆరవనెలలో ఫలప్రాశన, పదవ నెలలో అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకందించడానికి ఇది చాలా అవసరం. సరియైన ఫలాలు లభించకపోతే ఆరవనెలలోనే అన్నప్రాశన చేయాల్యల్సి ఉంటుంది. ఇది సుశ్రుతాచార్యులు చెప్పిన విషయం. శిశువులో రోగనిరోధక శక్తి పరిపుష్టమవడానికి, శారీరక, మానసిక వికాసానికి, ఆయుఃవృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి స్తన్యపానం అత్యంతావశ్యకమని ఆయుర్వేద గ్రంథాలన్నీ నొక్కివక్కాణించాయి. దీనినే ‘ఓజోవర్థనం’ అంటారు. తల్లిపాలు తక్కువయిన పక్షంలో ‘ఆవుపాలు, మేకపాలు’ శ్రేష్ఠమని ఆయుర్వేదోక్తం. వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపువేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి తాగించవచ్చు. శతావరీ చూర్ణం (5 గ్రాములు), పాలతో కలిపి, రెండుపూటలా తల్లి సేవిస్తే, తల్లికి సమృద్ధిగా స్తన్యం ఉత్పత్తి అవుతుంది. తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలుగాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు స్తన్యపానాన్ని ఆపాల్సి ఉంటుంది. ఒక నెల వయసు దాటిన అనంతరం బిడ్డకు ఒకటి లేదా రెండు చుక్కల గాడిదపాలు తాగిస్తే చాలా జబ్బులను నివారించే రోగనిరోధకశక్తి కలుగుతుందని శాస్త్రోక్తం. ప్యాకెట్ పాలుగాని, డబ్బాపాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’ లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజాఫలాలు, పాలు’ సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. సాత్వికాలోచన, సంతోషం స్తనకరం. శోకం, దుఃఖం, చింత, అసూయ వంటి ప్రతికూల ఉద్వేగాలు స్తన్యనాశనకరం. -
సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసమే వెళ్లా : సామినేని విమల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు బాధ్యత గల పౌరురాలిగా రాష్ట్రపతిని కలిశానని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణులందరూ కలిసి గవర్నర్ నర్సింహన్‌ను కలిశాం. ఆ సమయంలో టీడీపీ నేత అచ్చంనాయుడి సతీమణీ వచ్చారు. అప్పుడు మాట్లాడని చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడెందుకు రాద్దాంతం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. ‘గవర్నర్‌కు ఇచ్చినట్లే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని మూడు పార్టీల నేతల సతీమణులం ఆ రోజే చర్చించుకున్నాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాగానే అందరికీ సమాచారమిచ్చారు. గవర్నర్ దగ్గరికి వచ్చిన అచ్చంనాయుడి భార్య మాత్రం డుమ్మా కొట్టారు. దీంతో టీడీపీ రెండుకళ్ల సిద్ధాంతం మళ్లీ రుజువైంది’ అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు... రాష్ట్ర సమైక్యత కోసం తాము పోరాడుతుంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. -
విమలకోసం లైఫ్‌లైన్