ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి చెందిన సంఘటన దెంకాడ మండలం సింగవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
విజయనగరం: ఇంకుడు గుంతలో పడి ఇద్దరి చిన్నారులు మృతి చెందిన సంఘటన దెంకాడ మండలం సింగవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇంకుడు గుంతలో పడి విమల(6), తేజ(6) అనే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం 'నీరు-చెట్టు' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు తవ్వించింది.
అరదులో భాగంగా గ్రామంలోని పాఠశాల ఆవరణలో సుమారు 10 అడుగుల లోతు గుంత తవ్వించారు. ఇటీవల వర్షాలకు గుంత నిండా నీళ్లు చేరాయి. ఆడుకోవటానికి వెళ్లిన చిన్నారులు కనిపించక పోయేసరికి తల్లిదండ్రులు వెతకటం ప్రారంభించారు. చిన్నారులు ఇంకుడు గుంతలో విగతజీవులై ఉండటం గమనించి తల్లిదండ్రులు దిగ్భాంతికి గురయ్యారు.
(దెంకాడ)