కేసీఆర్‌ కుటుంబంలో విషాదం | KCRs sister Vimala passesaway | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబంలో విషాదం

Published Wed, Feb 21 2018 12:45 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

KCRs sister Vimala passesaway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన రెండో సోదరి విమలా బాయి(82) బుధవారం హఠాన్మరణం చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయమే కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు.

విమలా బాయి కుటుంబం హైదరాబాద్‌ అల్వాల్‌లో మంగాపురం కాలనీలో నివసిస్తున్నారు. అల్వాల్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న. ఇప్పుడు చనిపోయిన విమల రెండో సోదరి. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

                                                కేసీఆర్‌ రెండో సోదరి విమలా బాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement