కోర్టుకు హాజరైన సండ్ర | Sandra attend to court on note for vote | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన సండ్ర

Published Fri, Mar 31 2017 5:49 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కోర్టుకు హాజరైన సండ్ర - Sakshi

కోర్టుకు హాజరైన సండ్ర

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఆయన్ని నిందితునిగా చేరుస్తూ ఏసీబీ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు రేవంత్‌రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్‌ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement