
ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ స్పీచ్ల రికార్డులను స్వర పరీక్ష కోసం తెలంగాణ అసెంబ్లీ అధికారులు గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు. సెబాస్టియన్, మత్తయ్య టీవీ ఇంటర్వ్యూలను ఎఫ్ఎస్ఎల్కు పంపాలని ఏసీబీ కోర్టును అసెంబ్లీ అధికారులు కోరినట్టు సమాచారం.
కాగా, ఓటుకు నోట్లు కేసులో అరెస్టైన తెలంగాణ టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.