మరో నాలుగురోజులు గడువు కోరనున్న సండ్ర! | Sandra venkata veeraiah may be appeal to acb four days | Sakshi
Sakshi News home page

మరో నాలుగురోజులు గడువు కోరనున్న సండ్ర!

Published Fri, Jun 19 2015 11:49 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Sandra venkata veeraiah may be appeal to acb four days

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ...మరో నాలుగు రోజుల పాటు గడువు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సండ్ర ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు అయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని సండ్ర వీరయ్య...ఏసీబీని కోరనున్నట్లు సమాచారం.

 

కాగా ఓటుకు కోట్లు వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈనెల 19లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు ఏబీసీ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కుటుంబసభ్యుల వాంగ్మూలం రికార్డులను అధికారులు ఈరోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement