వెన్నునొప్పి, విచారణకు రాలేను: సండ్ర | note for vote: mla sandra venkata veeraiah write a letter to acb | Sakshi
Sakshi News home page

వెన్నునొప్పి, విచారణకు రాలేను: సండ్ర

Published Fri, Jun 19 2015 2:26 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

వెన్నునొప్పి, విచారణకు రాలేను: సండ్ర - Sakshi

వెన్నునొప్పి, విచారణకు రాలేను: సండ్ర

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీకి లేఖ రాశారు. వెన్నునొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వైద్యులు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారని, కోలుకున్నాక విచారణకు హాజరు అవుతానని సండ్ర తెలిపారు. (లేఖ పూర్తిపాఠం)

తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రికి... ఏసీబీ అధికారులు వచ్చినా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తన లేఖలో తెలిపారు. కాగా ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్యకు మంగళవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సండ్ర శుక్రవారం సాయంత్రం అయిదు గంటలలోగా హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తనకు అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఎమ్మెల్యే ...ఏసీబీకి లేఖ రాశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement