వీరయ్య వస్తారా?.. రారా?
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో తమ ఎదుట హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈనెల 19లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు ఏబీసీ నోటీసు పంపిన సంగతి తెలిసిందే. ఈరోజు ఏసీబీ ఎదుట ఆయన అవుతారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సండ్ర వెంకటవీరయ్య రాకపోతే ఆయనను ఏబీసీ అరెస్ట్ చేసే అవకాశముందంటున్నారు.
ఈకేసులో ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఏసీబీ... ఎమ్మెల్సీ బరిలో నిలిచిన వేం నరేందర్‌రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. నరేందర్‌రెడ్డిని ప్రశించి వదిలేసిన ఏసీబీ... సండ్ర విషయంలో ఎలాగ వ్యవహరిస్తుందనే దానిపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. కాగా, నోటీసులు అందుకోగానే అందులోని అంశాల ఆధారంగా స్పందిస్తానని సండ్ర వెంకటవీరయ్య అంతకుముందు తెలిపారు. ఏసీబీ విచారణకు సహకరిస్తానని చెప్పారు.