ఏసీబీ నోటీసులు తీసుకుంటా: సండ్ర
ఖమ్మం: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరవుతానని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఏసీబీ ఏం అడుగుతుందో దానికి సమాధానం చెబుతానని అన్నారు. ఏసీబీ నోటీసులు అందలేదని 'సాక్షి'కి ఫోన్ లో తెలిపారు. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు టీవీలో చూస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత నోటీసులు తీసుకుంటానన్నారు.
నోటీసుల్లో ఏముందో చదివిన తర్వాత తదనుగుణంగా ముందుకెళ్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్ట్స్‌లోని 208వ నంబర్ క్వార్టర్‌లో ఉన్న సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు మంగళవారం వెళ్లారు. ఆసమయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నోటీసులను క్వార్టర్ తలుపునకు అంటించారు.