‘ఓటుకు కోట్లు’ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ వ్యవహారానికి సూత్రధారి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడేనని తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించినట్లు తెలిసింది. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు అది ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అతికించినది కాదని... చంద్రబాబు స్టీఫెన్‌సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ‘ఒరిజినల్’ అని ఫోరెన్సిక్ స్పష్టం చేసినట్లు సమాచారం. బాబు మాట్లాడిన ఆడియో రికార్డు ట్యాపింగ్ వెర్షన్ కాదని.. అది ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు వచ్చిన కాల్‌ను రికార్డు చేసిన టేపు అని ధ్రువీకరించినట్లు తెలిసింది.