తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం జరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఓటుకు కోట్లు' కేసు పురోగతిపై కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్తో చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే సెక్షన్ 8, అటారీ జనరల్ సలహాల ప్రచారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా సెక్షన్-8ను తెరపైకి తేవడంపై గవర్నర్ వద్ద కేసీఆర్ నిరసన తెలిపినట్లు సమాచారం. కాగా అంతకు ముందు కేసీఆర్ ...ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం అయ్యారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.