
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు.
హైదరాబాద్: దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల కోసం, దొంగల కొరకు రాజ్యాంగ పరమైన సంస్థల జోక్యం ఉంటుందని మేం అనుకోవడంలేదని పేర్కొన్నారు. సెక్షన్-8 పై అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు. సెక్షన్-8 పై గవర్నర్ నరసింహన్ కు ఎలాంటి ఆదేశాలు వచ్చినట్లు ఇప్పటికీ సమాచారం లేదన్నారు.
ఒక దొంగను పట్టుకుంటే..అసలు దొంగ పార్టీ అధ్యక్షుడని దొరికిన దొంగే చెప్పాడని వివరించారు. ఓటుకు కోట్లు కేసును సెక్షన్ 8 తో ముడిపెట్టవద్దని కేకే హితవు పలికారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానిదేనని, ఆ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రిమినల్ విచారణలో ఎవరూ జోక్యం చేసుకున్నా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేకే పేర్కొన్నారు.