keshavarao
-
కేంద్రమే కొనాలి..
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కష్టాలను చూపేందుకే: కేకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనేవరకు వదలం: నామా కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఢిల్లీలో లొల్లికి రెడీ! యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది. శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. -
వివాదంలో కేకే కుమార్తె విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేశవరావు (కేకే) కుమార్తె విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెపై షేక్‌పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి తనపై దాడి చేసిందంటూ బుధవారం నాటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెతో పాటు అనుచరులు షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తనను దుర్భాషలాడడమే కాకుండా తన ఉద్యోగ విధుల రీత్యా హైకోర్టుకు వెళ్తుతుండగా అడ్డుకుని నెట్టివేశారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను ఎంపీ కేశవరావు కూతుర్ని అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీనివాస్ రెడ్డి ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండుసార్లు కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గ్రేటర్ పీఠం ఈసారి మహిళకు రిజర్వు కావడంతో ఆమె హైదరాబాద్ మేయర్ అయ్యే అవకాశం ఉందంటూ టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఆమె వివాదంలో చిక్కుకోవడం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే దీనిపై విజయలక్ష్మీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. -
మావోయిస్టు పార్టీలో కీలక మార్పులు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో కీలకమార్పులు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి పదవీ బాధ్యతలు నిర్వహించిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ఆ పదవి నుంచి తొలగాలని పోలిట్ బ్యూరో సభ్యులు అడిగినట్లు సమాచారం అందింది. ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంపై బాధ్యత వహిస్తున్నానని, తన పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు కూడా గణపతి ప్రకటించినట్లు వెల్లడైంది. గణపతి స్థానంలో నంబాలా కేశవరావు అలియాస్ బస్వరాజ్ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు తెలిసింది. నంబాలా కేశరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియోనిపేట. వరంగల్ ఆర్ఈసీలో కేశవరావు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 28 సంవత్సరాలుగా కేశవరావు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1980 జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. 2005లోనే కేశవరావుపై రూ.50 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. వయోభారంతోనే పార్టీ బాధ్యతలను, తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీని కూడా గణపతి, పార్టీకి అప్పగించినట్లు సమాచారం. -
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
హైదరాబాద్: దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదని టీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగల కోసం, దొంగల కొరకు రాజ్యాంగ పరమైన సంస్థల జోక్యం ఉంటుందని మేం అనుకోవడంలేదని పేర్కొన్నారు. సెక్షన్-8 పై అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు. సెక్షన్-8 పై గవర్నర్ నరసింహన్ కు ఎలాంటి ఆదేశాలు వచ్చినట్లు ఇప్పటికీ సమాచారం లేదన్నారు. ఒక దొంగను పట్టుకుంటే..అసలు దొంగ పార్టీ అధ్యక్షుడని దొరికిన దొంగే చెప్పాడని వివరించారు. ఓటుకు కోట్లు కేసును సెక్షన్ 8 తో ముడిపెట్టవద్దని కేకే హితవు పలికారు. శాంతి భద్రతల అంశం ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానిదేనని, ఆ విషయం రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. క్రిమినల్ విచారణలో ఎవరూ జోక్యం చేసుకున్నా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని కేకే పేర్కొన్నారు. -
'దొంగలను రక్షించమని ఏ చట్టం చెప్పదు'
-
కిరికిరి పెడితే మరో ఉద్యమమే..
కల్హేర్, న్యూస్‌లైన్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ తథ్యమని, ఆపడం ఎవరి వల్లా కాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కిరికిరి చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సోమవారం కల్హేర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని అన్నారు. ఆత్మ బలిదానాలు, పోరాటల ఫలితంగా తెలంగాణను సాధించుకుంటున్నామని, ప్రత్యేక రాష్ట్రం పునర్నిర్మాణంలో ఎదురయ్యే ఆంక్షల్ని ‘ఉఫ్’అని ఊదేసి తొలగించుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాదని తెలంగాణలో అధికారం సాధించి ప్రజల బతుకులను చక్కదిద్దుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రజలకు అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించ్చారు. రాయలకు నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘నైనై’ అని, నేడు ‘సైసై’ అంటున్నారన్నరు. మరో మారు వెన్నుపోటు పొడవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, తాను పదవులను సైతం వదులుకుని పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ కిరాయిదారులు, పెట్టుబడిదారులే హైదారాబాద్‌పై హక్కుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించి రెండుకళ్ల సిద్ధాంతం గురించి మాట్లడుతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుల అసమర్థతతో నారాయణఖేడ్ ప్రాంతాం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డి, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి, విజయరామరాజు, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, సర్పంచ్‌లు దీప్లానాయక్, సిత్కిబాయి, నాయకులు దాడె పండారి, వెంకటేశం సేట్, దిలీప్ కుమార్, నర్సింహాగౌడ్, బేగారి సాయిలు, సంజీవరావు, రాంసింగ్, బ్రహ్మం పాల్గొన్నారు. -
హైదరాబద్‌లో ఉన్న సీమాంద్రులకు భయం లేదు : కేకే