కల్హేర్, న్యూస్‌లైన్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ తథ్యమని, ఆపడం ఎవరి వల్లా కాదని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కిరికిరి చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సోమవారం కల్హేర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని అన్నారు. ఆత్మ బలిదానాలు, పోరాటల ఫలితంగా తెలంగాణను సాధించుకుంటున్నామని, ప్రత్యేక రాష్ట్రం పునర్నిర్మాణంలో ఎదురయ్యే ఆంక్షల్ని ‘ఉఫ్’అని ఊదేసి తొలగించుకుంటామన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాదని తెలంగాణలో అధికారం సాధించి ప్రజల బతుకులను చక్కదిద్దుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రజలకు అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించ్చారు. రాయలకు నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘నైనై’ అని, నేడు ‘సైసై’ అంటున్నారన్నరు. మరో మారు వెన్నుపోటు పొడవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, తాను పదవులను సైతం వదులుకుని పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ కిరాయిదారులు, పెట్టుబడిదారులే హైదారాబాద్‌పై హక్కుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించి రెండుకళ్ల సిద్ధాంతం గురించి మాట్లడుతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుల అసమర్థతతో నారాయణఖేడ్ ప్రాంతాం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.భూపాల్‌రెడ్డి, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి, విజయరామరాజు, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, సర్పంచ్‌లు దీప్లానాయక్, సిత్కిబాయి, నాయకులు దాడె పండారి, వెంకటేశం సేట్, దిలీప్ కుమార్, నర్సింహాగౌడ్, బేగారి సాయిలు, సంజీవరావు, రాంసింగ్, బ్రహ్మం పాల్గొన్నారు.
కిరికిరి పెడితే మరో ఉద్యమమే..
Published Mon, Dec 2 2013 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM
Advertisement
Advertisement