Ramreddy
-
బీజేపీతోనే రాష్ట్రంలో సుస్థిర పాలన
సాక్షి,లింగంపేట: భారతీయ జనతా పార్టీతోనే రాష్ట్రంలో, కేంద్రంలో సుస్థిర పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలతోనే రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.సంతలో ప్రచారం నిర్వహించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు దత్తురాం, రాంచందర్, కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్
కర్నూలు జిల్లా : అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన ఈయన 40 సంవత్సరాలుగా కోవెలకుంట్ల పట్టణంలో డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు. రామిరెడ్డి సేవా సమితి ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నుంచి పేద కుటుంబాల జీవనోపాధికి, పేద యువతుల వివాహానికి ఆర్థికసాయం అందిస్తున్నారు. 1987వ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని కేటాయిస్తూ ఎంపీటీసీ టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అప్పటినుంచి పార్టీలో కొనసాగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. గత ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డికి కోవెలకుంట్ల పట్టణంలో భారీ మెజార్టీ వచ్చేలా చేశారు. దశాబ్దాల కాలం నుంచి తెలుగుదేశానికి సేవలందిస్తున్న రామిరెడ్డికి ఇటీవలి కాలంలో పార్టీలో గుర్తింపు లేకపోవడం, కొందరి నాయకుల ప్రోద్బలంతో ప్రాధాన్యత తగ్గించడం, తదితర పరిణామాలతో మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహాలు తీసుకుని ప్రాధాన్యత ఇవ్వని పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాసనాయక్, మాజీ ఎంపీటీసీ కుమారి, నాగభూషణంరెడ్డి, పాండురంగస్వామి దేవాలయ కమిటీ సభ్యుడు కంభంపాటి నాగేష్, మాజీ వార్డు మెంబర్ బాలరాజు, రామిరెడ్డి సేవా సమితి సభ్యులు బాలరాజు, రఘు, వేణు, నాగార్జున, జిలాని, సంజన్న, వలి, తదితరులు రామిరెడ్డి బాటలో నడవనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందించానని, ప్రస్తుతం అక్కడ గుర్తింపు లేకపోవడంతో కలత చెంది పార్టీ వీడినట్లు పేర్కొన్నారు. తనవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. -
నకిలీ విత్తనాలతో కుళ్లిన వరి
ఐదున్నర ఎకరాల్లో పంట నష్టం హవేళిఘణాపూర్ (మెదక్): మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాజేందర్‌రెడ్డి, రాంరెడ్డి నకిలీ విత్తనాలతో మోసపోయారు. మెదక్ పట్టణంలోని రైతునేస్తం ఫర్టిలైజర్ దుకాణంలో ఆమోగ్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి వీరు తూకాలు పోశారు. గత నెల తూకాలను తీసి నాట్లు వేశారు. 17 రోజులు గడుస్తున్నా వరి పైరు పెరగకపోగా, పంటంతా కుళ్లి పోయింది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకులు మొత్తం ఎండిపోయాయి. ఐదున్నర ఎకరాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. రూ.80 వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటంతా కళ్ల ముందే కుళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాగమాధురి పొలాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కోరుట్ల: మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి(45) ఈ రోజు ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హామీల అమలులో విఫలం
నూతనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని యడవెల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్బెడ్రూమ్ ఇండ్లు, ముస్లీం మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు 12శాతం రిజరేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నర్సయ్య, జన్నారెడ్డి వివేక్‌రెడ్డి, నాగం సుధాకర్‌రెడ్డి, మర్రు ప్రసాద్‌రావు, బద్దం ప్రశాంత్‌రెడ్డి, మేడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సంగారెడ్డి జోన్: జాతీయ యువజన అవార్డుల కోసం ఆసక్తిగల యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవలో ఉత్తమ సేవలందించిన 15 – 29 సంవత్సరాల మధ్య వయువస్సు ఉన్న యువతీ యువకుల నుంచి, మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిజిష్టర్ అయిన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జాతీయ వ్యక్తిగత అవార్డు కోసం మూడేళ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ఉండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలైతే 1860 సొసైటీ యాక్టు ప్రకారం నమోదై మూడేళ్లుగా పనిచేస్తూ ఉండాలన్నారు. అర్హులైన వారు వచ్చే నెల 5లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శిగా రాంరెడ్డి నియామకం
సంగారెడ్డి టౌన్: వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా బి.రాంరెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో ఆయన రాంరెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాంరెడ్డి ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మా... ధన్యవాదాలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దర్శనం లభించింది. పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, కుంజా సత్యవతి బుధవారం ఉదయం సోనియాను ఢిల్లీలోని ఆమె నివాసమైన 10జన్‌పథ్‌లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయబోతున్న కాంగ్రెస్ అధినాయకురాలిని కలిసి ఖమ్మం జిల్లా ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేశామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తున్నందున జిల్లా ప్రజానీకమంతా రుణపడి ఉంటామని సోనియాకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు వీరంతా తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం సభ్యుడు జైరాంరమేశ్‌ను కలిశారు. భద్రాచలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రాంతంలో కలపవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం ముంపు గ్రామాలను కూడా సీమాంధ్రలో కలిపేందుకు అక్కడ నివసించే ప్రజలు అంగీకరించడం లేదని జైరాంకు తెలియజేశారు. -
ఈ ఉపాధ్యాయులు మాకొద్దు
పూడూరు, న్యూస్‌లైన్: పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు. టీచర్లను పాఠశాల నుంచి పంపించివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సంఘటన శనివారం పూడూరులో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ యాదమ్మ, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, విద్యార్థిని హాషంబీ తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా ఆయా జట్లకు విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, విద్యార్థిని హాషంబీల మధ్య గొడవ జరిగింది. దీంతో హాషంబీ ‘నేను క్రీడల్లో పాల్గొనబోను.. నా జట్టు విద్యార్థుల కూడా ఆడరు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘నీతో పాటు తోటి విద్యార్థులను కూడా ఆడకుండా చేస్తావా’ అంటూ పాఠశాల పీఈటీ దేవదాసు మందలించారు. ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి విద్యార్థిని హాషంబీపై చేయిచేసుకున్నారు. దీంతో హాషంబీ జరిగిన విషయాన్ని తన కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పాఠశాలకు వచ్చి విద్యార్థినిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు గొడవ మొదలైంది. వీరిని సముదాయించేందుకు పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. విషయం చినికిచినికి గాలివానగా మారింది. గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొడవపడుతున్నారనే సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని గొడవకు గల కారణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సముదాయించి ఆయన వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొదట్నుంచీ అభ్యంతరకరంగానే.. జ్యోతిలక్ష్మి, దేవదాసులు పూడూరు పాఠశాలలో విధుల్లో చేరాకే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని విద్యార్థులు, గ్రామ సర్పంచ్ యాదమ్మ, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వారు పాఠాలు బోధించడం మానేసి కబుర్లు చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందే ఒకరికొకరు పుష్పాలు ఇచ్చుకోవడం వంటివి చేసేవారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పిల్లల ముందు చేయరాదని.. విద్యార్థులు కూడా లేనిపోనివి అలవాటు చేసుకుంటారంటూ గతంలోనే పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి, డిప్యూటి డీఈఓకు పాఠశాల ఎస్ఎసీ చైర్మన్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిలో మార్పు తీసుకువస్తానని హెచ్ఎం నచ్చజెప్పడంతో అప్పట్లో శాంతించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా విద్యార్థులపై దాడి చేయడం సరైంది కాదంటూ పెద్ద ఎత్తున నినదించారు. గ్రామ సర్పంచ్, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లకు కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారంటూ వారు మండిపడ్డారు. పాఠశాలలో ఈ ఇద్దరి ఉపాధ్యాయుల ఆగడాలను అడ్డుకోడంలో విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహించి శనివారం నేరుగా డీఈఓ సోమిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఈఓ పాఠశాల హెచ్ఎం రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. జరిగిన విషయం, ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, దేవదాసు ప్రవర్తనపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు చెందిన మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ల అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారు చేసి డీఈఓకు పంపించారు. పూడూరు మండల కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ యాదమ్మ, పాఠశాల చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా డీఈఓ కలిసి తమ వాదనను వినిపించి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరివెళ్లారు. -
కిరికిరి పెడితే మరో ఉద్యమమే..
కల్హేర్, న్యూస్‌లైన్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ తథ్యమని, ఆపడం ఎవరి వల్లా కాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు పెట్టినా, కిరికిరి చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సోమవారం కల్హేర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల మండల స్థాయి శిక్షణ జరిగింది. ఈ కార్యక్రమానికి కేశవరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని అన్నారు. ఆత్మ బలిదానాలు, పోరాటల ఫలితంగా తెలంగాణను సాధించుకుంటున్నామని, ప్రత్యేక రాష్ట్రం పునర్నిర్మాణంలో ఎదురయ్యే ఆంక్షల్ని ‘ఉఫ్’అని ఊదేసి తొలగించుకుంటామన్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాదని తెలంగాణలో అధికారం సాధించి ప్రజల బతుకులను చక్కదిద్దుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని ప్రజలకు అన్యాయం జరిగితే సహించమని హెచ్చరించ్చారు. రాయలకు నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ‘నైనై’ అని, నేడు ‘సైసై’ అంటున్నారన్నరు. మరో మారు వెన్నుపోటు పొడవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నుతున్నారని కేశవరావు మండిపడ్డారు. తెలంగాణ కోసం కేసీఆర్, తాను పదవులను సైతం వదులుకుని పోరాటం సాగిస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లడుతూ కిరాయిదారులు, పెట్టుబడిదారులే హైదారాబాద్‌పై హక్కుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిభ్రమించి రెండుకళ్ల సిద్ధాంతం గురించి మాట్లడుతున్నారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం పాలకుల అసమర్థతతో నారాయణఖేడ్ ప్రాంతాం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డి, కల్హేర్, పెద్దశంకరంపేట మండలాల పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి, విజయరామరాజు, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, సర్పంచ్‌లు దీప్లానాయక్, సిత్కిబాయి, నాయకులు దాడె పండారి, వెంకటేశం సేట్, దిలీప్ కుమార్, నర్సింహాగౌడ్, బేగారి సాయిలు, సంజీవరావు, రాంసింగ్, బ్రహ్మం పాల్గొన్నారు. -
రాంగ్ రూట్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : సమాజాభివృద్ధిలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సి ఉంది. ప్రస్తుతం యువత దారితప్పుతోంది. దురలవాట్లకు బానిసలై తల్లిదండ్రులకు బాధను మిగిల్చడంతో పాటు సమాజానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నారు. దొంగతనాలు, దొపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించే వారు కూడా ర్యాగింగ్ పేరుతో వికృత క్రీడకు పాల్పడుతున్నారు. ఖాజీపేటకు చెందిన రామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి అనే వారు లావ ణ్య అనే మహిళతో కలిసి గత నెల 4వ తేదీన కడపకు చెందిన శ్రీనివాసులును సెల్ ఫోన్ ద్వారా ముగ్గులోకి దించి తమ వద్దకు రప్పించుకుని కిడ్నాప్ చేశారు. రూ. 35 లక్షలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ సంభాషణను ఆసరాగా తీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుండేవారు. శ్రీనివాసులు దగ్గర నుంచి రెండు విడతలుగా రూ. 14.50 లక్షలను వసూలు చేశారు. మరింత డబ్బును డిమాండ్ చేసే ప్రయత్నంలో ముఠా మొత్తం పోలీసులకు చిక్కింది. ముఠాలోని రామిరెడ్డి ఖాజీపేటలో ఓ విద్యాసంస్థను నడుపుతున్నారు. సునీల్ గ్యాంగ్ పేరు చెబుతూ ధనుంజయ, రామకృష్ణ, వీరేందర్, వెంకటేష్ అనే వారు బెదిరింపులు చేసేవారు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ వైద్య దంపతులు సత్య ప్రసాద్, సంధ్యలకు బెదిరింపు ఫోన్లు చేసి రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాకచక్యంగా వలపన్నడంతో ముఠా పోలీసుల చేతికి చిక్కింది. ముఠాలోని వీరేందర్, వెంకటేష్ విద్యార్థులు కావడం గమనార్హం. వైద్య విద్యను అభ్యసించి సమాజంలో ఉత్తమ వైద్యులుగా తయారు కావాల్సిన కొందరు రిమ్స్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడిన సంఘటన గత నెల 24న వెలుగులోకి వచ్చింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థులు హాస్టల్‌ను విడిచివెళుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తోట వెంకటరమణ అనే యువకుడు వరస హత్యలను చేసుకుంటూ పోతున్నాడు. బంధువులనే లక్ష్యంగా చేసుకుని హత్యలను చేస్తుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఓబుళాపురం మండలం జీవీపురంలో పోలీస్‌పికెట్ ఉండగానే గత నెల 24వ తేదీన సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాల్చి చంపాడు. కడప చిన్నచౌకు పరిధిలో రమణయ్య, జగదీశ్‌కుమార్‌రెడ్డి అనే యువకులు మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. వీరి దగ్గరి నుంచి గత నెల 28వ తేదీన చిన్నచౌకు పోలీసులు 106 గ్రాముల బరువు ఉన్న ఆరు బంగారు గొలుసులను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నవంబరు నెల 29వ తేదీన ముగ్గురు యువకులు నబీకోట శివాలయం సమీపంలో వరలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ప్రయత్నంలో మహిళతో పాటు యువకులు కూడా గాయపడ్డారు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
రాంగ్ రూట్
కడప అర్బన్, న్యూస్‌లైన్ : సమాజాభివృద్ధిలో యువతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాల్సి ఉంది. ప్రస్తుతం యువత దారితప్పుతోంది. దురలవాట్లకు బానిసలై తల్లిదండ్రులకు బాధను మిగిల్చడంతో పాటు సమాజానికి గొడ్డలిపెట్టులా తయారవుతున్నారు. దొంగతనాలు, దొపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఉన్నత చదువులు అభ్యసించే వారు కూడా ర్యాగింగ్ పేరుతో వికృత క్రీడకు పాల్పడుతున్నారు. ఖాజీపేటకు చెందిన రామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి అనే వారు లావ ణ్య అనే మహిళతో కలిసి గత నెల 4వ తేదీన కడపకు చెందిన శ్రీనివాసులును సెల్ ఫోన్ ద్వారా ముగ్గులోకి దించి తమ వద్దకు రప్పించుకుని కిడ్నాప్ చేశారు. రూ. 35 లక్షలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెల్ ఫోన్ సంభాషణను ఆసరాగా తీసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుండేవారు. శ్రీనివాసులు దగ్గర నుంచి రెండు విడతలుగా రూ. 14.50 లక్షలను వసూలు చేశారు. మరింత డబ్బును డిమాండ్ చేసే ప్రయత్నంలో ముఠా మొత్తం పోలీసులకు చిక్కింది. ముఠాలోని రామిరెడ్డి ఖాజీపేటలో ఓ విద్యాసంస్థను నడుపుతున్నారు. సునీల్ గ్యాంగ్ పేరు చెబుతూ ధనుంజయ, రామకృష్ణ, వీరేందర్, వెంకటేష్ అనే వారు బెదిరింపులు చేసేవారు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ వైద్య దంపతులు సత్య ప్రసాద్, సంధ్యలకు బెదిరింపు ఫోన్లు చేసి రూ. 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాకచక్యంగా వలపన్నడంతో ముఠా పోలీసుల చేతికి చిక్కింది. ముఠాలోని వీరేందర్, వెంకటేష్ విద్యార్థులు కావడం గమనార్హం. వైద్య విద్యను అభ్యసించి సమాజంలో ఉత్తమ వైద్యులుగా తయారు కావాల్సిన కొందరు రిమ్స్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడిన సంఘటన గత నెల 24న వెలుగులోకి వచ్చింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేక జూనియర్ విద్యార్థులు హాస్టల్‌ను విడిచివెళుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తోట వెంకటరమణ అనే యువకుడు వరస హత్యలను చేసుకుంటూ పోతున్నాడు. బంధువులనే లక్ష్యంగా చేసుకుని హత్యలను చేస్తుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. ఓబుళాపురం మండలం జీవీపురంలో పోలీస్‌పికెట్ ఉండగానే గత నెల 24వ తేదీన సుబ్రమణ్యం అనే వ్యక్తిని కాల్చి చంపాడు. కడప చిన్నచౌకు పరిధిలో రమణయ్య, జగదీశ్‌కుమార్‌రెడ్డి అనే యువకులు మహిళలు ఒంటిరిగా కనిపిస్తే చాలు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు. వీరి దగ్గరి నుంచి గత నెల 28వ తేదీన చిన్నచౌకు పోలీసులు 106 గ్రాముల బరువు ఉన్న ఆరు బంగారు గొలుసులను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గత నవంబరు నెల 29వ తేదీన ముగ్గురు యువకులు నబీకోట శివాలయం సమీపంలో వరలక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాన్ని లాక్కెళ్లే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈ ప్రయత్నంలో మహిళతో పాటు యువకులు కూడా గాయపడ్డారు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు
మేడ్చల్, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ వాదుల ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ఆయన వ్యవహారశైలిపై నిరసన వ్యక్తమవుతోంది. ఇందుకు రచ్చబండ కార్యక్రమం వేదికవుతోంది. మేడ్చల్‌లో బుధవారం రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో రభసకు దారితీ సింది. వేదికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో పాటు ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేఎల్లార్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడటానికి ఉపక్రమిస్తుండగా తెలంగాణవాదులు గొడవ ప్రారంభించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీశ్యాంరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు టీడీపీకి చెందిన సర్పంచ్‌లు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ఫొటోను చించేందుకు ప్రయత్నించా రు. సీఐ రాంరెడ్డి వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకునిఅదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు సత్యనారాయణ సభా ప్రాంగణంలోకి దూసుకొచ్చారు. జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని సభనుంచి బయటకు పంపించివేశారు. ఇంతలోనే టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విష్ణుచారి, నాయకుడు రవీందర్‌తో తదితరులు వేదిక వెనుకవైపు నుంచి వచ్చి ఫ్లెక్సీని లాగేశారు. దీంతో పోలీసులు వారినుంచి ఫ్లెక్సీని తీసుకునేందుకు యత్నించగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫ్లెక్సీని స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీని తీసుకొని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఫొటో కన్పించకుండా ఓ పోస్టర్ అతికించి కార్యక్రమాన్ని కొనసాగించారు. కాగా మళ్లీ గొడవ జరుగుతుందేమోననే అనుమానంతో పోలీసులు రచ్చబండ ఫ్లెక్సీకి కార్యక్రమం పూర్తయ్యే వరకూ బందోబస్తుగా నిలిచారు. -
రాంరెడ్డి, రేణుక వర్గీయుల విమర్శల యుద్ధం
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో నిట్టనిలువునా చీలిక వచ్చింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన విమర్శలతో ఇరువురి అనుచరులు రెండువర్గాలుగా విడిపోయారు. అంతేకాకుండా ఇరువురి అనుంగు నేతలు డీసీసీ కార్యాలయం వేదికగా తమ నేతలను వెనకేసుకొని వస్తూ విమర్శలకు దిగారు. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రెండురోజుల క్రితం రేణుకపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం, రేణుక వర్గీయులు ఈ వ్యాఖ్యలను ఖండించిన విషయం విదితమే. ఈనేపథ్యంలోనే గురువారం డీసీసీ కార్యాలయం వేదికగా మంత్రి అనుచర మాజీ కౌన్సిలర్లు, కొంతమంది ముఖ్యనాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేణుకాచౌదరిపై విమర్శలు గుప్పించారు. మళ్లీ ‘ఎక్కడి ఆడబిడ్డవో చెప్పాలని, తెలంగాణ వ్యతిరేకి’ అంటూ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మంత్రి అనుచరుడు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి కోరం కనకయ్య కూడా ఆమెపై నిప్పులు చెరిగారు. బయ్యారం, కూసుమంచి, టేకులపల్లి, కామేపల్లిలో మంత్రి అనుచరులు ఆయనకు మద్దతుగా రేణుకపై విమర్శల దాడి చేశారు. కాగా, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేణుకాచౌదరి జిల్లా అభివృద్ధికి ఎంతో చేశారని, ఆమెను ఎప్పటికీ జిల్లా ప్రజలు ఆడబిడ్డగానే చూసుకుంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా... ఈనెల 13,14 తేదీల్లో రేణుకా చౌదరి ఖమ్మంలోనే ఉంటారని, రేణుకకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు దమ్ము, సత్తా ఉంటే ఆ రోజు వచ్చి ఆమె ఎదురుగా విమర్శలు చేయాలని సవాల్ చేశారు. ఇలా ఇరువురు నేతల మధ్య ఉన్న విభేదాలు బహిరంగం కావడం, వర్గాల వారీ బలప్రదర్శనకు దిగడంతో రాజకీయం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా డీసీసీ కార్యాలయం సాక్షిగా ఇరువర్గాల అనుచరులు విమర్శలు సంధించుకుంటూ సవాళ్లు విసురుకుంటుంటే పార్టీ శ్రేణులు విస్తుబోతున్నాయి. ఈవివాదంలో... మంత్రి వర్గంగా ముద్ర పడిన వారు పూర్తిగా ఆయనకే మద్దతు పలుకుతుండగా.. మరికొంత మంది రేణుకను కాదంటే చివరకు ఆమె ఏం చేస్తారోనని జంకుతూ మధ్యేమార్గంగా ఉంటున్నారు. కృతజ్ఞత సభతోనే కౌంటర్ యాక్షన్... తనను తెలంగాణ కృతజ్ఞత సభకు రానివ్వకుండా మంత్రి వేస్తున్న పాచికలు పారవని.. తనకు అహ్వానం ఉంటుందని..ఈ సభతోనే మంత్రికి గుణపాఠం చెబుదామని...రేణుక తన అనుచరులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కూడా ఖండించడంతో ఆమె వనమా ద్వారానే తన అనుచర గణానికి ఈ విషయమై ఫోన్లో గత రెండు రోజులుగా చెప్పించినట్లు తెలిసింది. కృతజ్ఞత సభకు ఎలాగైనా ఆహ్వానం అందుతుందని.., సభతోనే మంత్రి, ఆయన అనుచర వర్గం నోళ్లు మూయిద్దామని చర్చించినట్లు సమాచారం. అప్పటి వరకు మంత్రిపై జిల్లా వ్యాప్తంగా తన అనుచర నాయకులతో విమర్శలు చేయించాలని వనమాను ఆదేశించినట్లు తెలిసింది. ఈ చిచ్చు ఆరేనా..? ఒకపక్క తెలంగాణ వస్తుందన్న సంబరాల్లో ఉండాల్సిన తరుణంలో పార్టీలో చెలరేగిన చిచ్చుపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇప్పుడే సమసిపోయేలా లేదని, ఈ ప్రభావం తెలంగాణ కృతజ్ఞత సభపై పడుతుందని, అధిష్టానం లేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే సయోధ్య కుదురుతుందని అంటున్నారు. కాగా, త్వరలో జిల్లాకు రేణుకాచౌదరి వస్తున్నారని ఆమె అనుచర నేతలు ప్రకటించడంతో ఆమె ప్రత్యక్ష స్పందన ఎలా ఉంటుందోనని, కల్లోలం ఎటుతిరిగి ఎటు వస్తుందోననే చర్చ జోరుగా నడుస్తోంది. -
దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం?
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుతోంది. తనపై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మండిపడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత అధినాయకులు మంత్రి వెనకాల ఉండి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాను తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఇదేమి చూడకుండా విమర్శిస్తారా..అంటూ ఈపరిణామాలపై హస్తినలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర విభజనపై పీకల్లోతు సమస్యల్లో ఉన్న దిగ్విజయ్‌సింగ్ ఆమె ఫిర్యాదును పట్టించుకోరని, ఈ వ్యవహారం అంతా తెలంగాణ మంత్రులు చూసుకుంటారని, మంత్రి మాత్రం 21వ తేదీన జరిగే సభ విజయవంతంపైనే దృష్టి పెట్టారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా ఆడబిడ్డనంటూ ఇప్పటి వరకూ రేణుక ఎన్ని రాజకీయాలు నడిపినా మౌనంగా ఉన్న మంత్రి హఠాత్తుగా దాడి చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు వెన్నుదన్నుగా నిలవడం వల్లే తీవ్రస్థాయిలో ఆమెపై మంత్రి విరుచుకుపడ్డారని సమాచారం. తాజా పరిణామాలపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఇతర తెలంగాణ మంత్రులు సైతం ఏమీ భయపడవద్దని మంత్రికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 21వ తేదీన ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కృతజ్ఞత సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేణుకను ఆహ్వానించరాదన్న ఉద్దేశంతోనే మంత్రి ఆమెపై వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగా...మంత్రి వ్యాఖ్యలను జిల్లాలో రేణుకాచౌదరి వర్గీయులు కొందరు ఖం డించారు. అయితే గతంలో ఆమె అనుంగులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రి వ్యాఖ్యలను ఖం డించకపోగా ఆయనకు లోపాయికారిగా మద్దతు పలికినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన ఈ వ్యవహారంలో మంత్రికే మద్దతిచ్చారు. హుకుం జారీ చేసినా... మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని రేణుక జిల్లాలోని తన ముఖ్య అనుచరులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే వారిలో కొందరు మాత్రమే ఇందుకు స్పందించారు. మిగిలిన వారు ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా రాజధానిలోనే ఉన్న డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును కూడా ఆమె ఈమేరకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన హైదారబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. రేణుక ఇచ్చిన స్క్రిప్టతోనే ఇటు వనమా, అటు కొందరు అనుచరులు మంత్రి చేసిన విమర్శలపై స్పందించినట్లు రాంరెడ్డి క్యాడర్ చర్చించుకుంటోంది. మొత్తంగా అదును చూసి దెబ్బతీసిన ప్రత్యర్థివర్గంపై రేణుక ప్రతీకారం తీర్చుకుంటారని, ఇందుకు ఎలాంటి వ్యూహం పన్నుతారో అనే చర్చ కూడా నడుస్తోంది.