హామీల అమలులో విఫలం
నూతనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని యడవెల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ఆచరణకు సాధ్యం కానీ హామీలను ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, ముస్లీం మైనార్టీలకు రిజర్వేషన్, గిరిజనులకు 12శాతం రిజరేషన్లు కల్పిస్తానని ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నర్సయ్య, జన్నారెడ్డి వివేక్‌రెడ్డి, నాగం సుధాకర్‌రెడ్డి, మర్రు ప్రసాద్‌రావు, బద్దం ప్రశాంత్‌రెడ్డి, మేడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.