రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఓటుకు కోట్లు’ కేసును కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు రాష్ర్ట అవినీతి నిరోధక శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు కోట్లు ఆఫర్ చేసి అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరికొందరు ఉన్నట్లుగా స్టీఫెన్‌సన్ చేసిన ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిశీలించాలని సీఈసీ సూచించింది. నిజాలు నిగ్గు తేల్చాలని, అసలు దోషులెవరో తేలేంత వరకు సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంటూ ఏసీబీకి తాజాగా లేఖ రాసింది
Published Thu, Jun 18 2015 6:08 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement