తెలంగాణ ప్రజలు, కార్యకర్తల అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే పార్టీపై, తనపై విశ్వాసంతో ఏపీలో అధికారం ఇచ్చినందున ఇక్కడ ఉండిపోవడం సాధ్యం కావడం లేదన్నారు. తెలంగాణలో పార్టీకోసం ఎక్కువ సమయాన్ని కేటారుుస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పార్టీకి బలమైనా, బలహీనత అయినా నాయకత్వమే అని, సమన్వయం తో పనిచేయాలన్నారు.