బాబుగారి కథలు చెల్లవిక | Forensic report reveals about Note for vote case Audio, Video tapes | Sakshi
Sakshi News home page

బాబుగారి కథలు చెల్లవిక

Published Thu, Jun 25 2015 10:14 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

బాబుగారి కథలు చెల్లవిక

బాబుగారి కథలు చెల్లవిక

చంద్రబాబు కథ: టేపులు అతికించినవి, ఎక్కడెక్కడో మాట్లాడితే.. వాటిని ఒక చోట పేర్చారు.
నిజం: ఆడియో, వీడియో టేపులు కల్పితాలు కావు, ఇవి నిజమైనవేనంటూ ఫోరెన్సిక్ రిపోర్ట్.

చంద్రబాబు కథ: ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేసు... ఎన్నికల సంఘం చూసుకుంటుంది. ఏసీబీకి ఏం పని?
నిజం : ఈ కేసు అవినీతి కేసని ఎన్నికలసంఘం తేల్చిచెప్పింది. ఏసీబీ కేసుకూడా ఫైల్ చేయొచ్చని స్పష్టంచేసింది. కోర్టు తీర్పు వచ్చాక ఈసీకూడా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.

చంద్రబాబు కథ: ఆడియో, వీడియో టేపులను కోర్టులు పరిగణలోకి తీసుకోవు.
నిజం : ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డిజిటల్ పరికరాల్లో ఉన్నవీ ఆధారాలే. కాకపోతే వీటికి సర్టిఫికేషన్ అవసరం. అంటే... ఇవి కల్పితం కాదంటూ ఒక నిఫుణిడి ధృవపత్రం అవసరం. ఆపనికూడా పూర్తయ్యింది. ఒరిజనలే అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే రిపోర్టు ఇచ్చింది.

చంద్రబాబు కథ : సెక్షన్ - 8 అమలు చేయాలంటూ.. అటార్నీ జనరల్ గవర్నర్ కు లేఖ రాశారు
నిజం: అలాంటి లేఖ ఏమీ రాయలేదు. అస్సలు సెక్షన్ - 8 కి, ఏసీబీ కేసుకు సంబంధం లేదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టంచేయడం

చంద్రబాబు కథ: నాతో సహా చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. దాదాపు 120 మంది ఫోన్లను ట్యాప్ చేశారు.
నిజం: ట్యాపింగ్ జరగలేదని టెలికాం కంపెనీలు స్పష్టంచేశాయి. 16 గంటల విచారణలో ఇదే విషయాన్ని చెప్పాయి.

చంద్రబాబు కథ: మత్తయ్యకు తెలంగాణ ప్రభుత్వం నుంచి, కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది.
నిజం: మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో కూడా లేదు. కేసీఆర్ మనుషులంటూ చెప్పుకున్న కొందరు తనను బెదిరించారని మత్తయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

చంద్రబాబు కథ: అవసరమైతే హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు పెడుతుంది. మాకు మేమే రక్షణ కల్పించుకుంటాం.
నిజం: హైదరాబాద్ లో ఏపీ పోలీస్ స్టేషన్లు పెట్టడానికి వీల్లేదన్న కేంద్రహోంశాఖ. కర్నూలునుంచి తెప్పించిన పోలీసులనుకూడా తిరిగి వెనక్కి పంపిన ఏపీ డీజీపీ

చంద్రబాబు కథ: హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంత ప్రజలను వేధిస్తున్నారు.
నిజం : చంద్రబాబు తన రాజకీయాలకోసం తమను వాడుకోవద్దని హైదరాబాద్ సెటిలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ పెట్టిమరీ స్పష్టంచేసింది. చంద్రబాబు లేకున్నా... తాము భద్రంగానే ఉంటామని చెప్పారు.

చంద్రబాబు కథ: 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానపడ్డారన్న చంద్రబాబు.
నిజం: ఎవ్వరూ అవమానపడలేదన్న అఖిలపక్షనేతలు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. చంద్రబాబు తప్పులను జనంపై రుద్దొద్దని హెచ్చరిక.  చంద్రబాబు లేకున్నా.. ప్రజలను చూసుకునేందుకు వ్యవస్థలున్నాయని స్పష్టంచేసిన నేతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement