
'మంత్రులూ మాటలు కట్టిపెట్టండి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఓటుకు కోట్ల వ్యవహారంలో మాటలు కట్టిపెట్టి.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు.
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఓటుకు కోట్ల వ్యవహారంలో మాటలు కట్టిపెట్టి.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అమర్ నాథ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
'చంద్రబాబును అన్నందుకే వైఎస్సార్ మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. జగన్ పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు చనిపోయారు. మరి దీనికి ఏమంటావ్' అని అమర్ నాథ్ మంత్రి అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.