ఓటుకు కోట్లు కేసులో నిందితుడు జెరూసులేం మత్తయ్య తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై జరుపుతున్న విచారణ నుంచి తప్పుకోవాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థిస్తూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. దాదాపు అరగంటపాటు వాదనలు విన్న న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బులుసు శివశంకరరావు తదుపరి వాదనల నిమిత్తం విచారణను గురువారానికి వాయిదా వేశారు.