
ఇది కళ్యాణ ద్రోహం: రాంగోపాల్ వర్మ
రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు కోట్లు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్షంగా పశ్నించారు.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఓటుకు కోట్లు వ్యవహారంపై జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ పరోక్షంగా పశ్నించారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయనపై సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేశారు.
'ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహం... ఇది కళ్యాణ ద్రోహం. పాలకుల్ని ప్రశ్నిస్తాననే వాడు ప్రశ్నించనప్పుడు, కళ్యాణం కోరుకునే జనాలకి ప్పెళ్ళెప్పుడు? ' అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.
ఓటుకు కోట్లు వ్యవహారంపై ఇంతకుముందే వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'చంద్రబాబు అనుసరించిన తీరుతో ఆంధ్రుడినని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నా' నని వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబు చర్య వల్ల రాష్ట్ర ప్రజలు జాతీయస్థాయిలో తలవంపులకు గురికావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
— Ram Gopal Varma (@RGVzoomin) June 19, 2015