'బాబూ.. ఆ గొంతు మీదా కాదా?'
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది మీరో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చంద్రబాబును ప్రశ్నించారు. ఫోన్లో స్టీఫెన్తో మాట్లాడిన గొంతు మీదా కాదా అని హరీష్ రావు అన్నారు.
బుధవారం హైదరాబాద్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. స్టీఫెన్తో ఫోన్ సంభాషణల విషయం గురించి చంద్రబాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా ఓటుకు నోటు కేసును పక్కదారిపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడి ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.