
రేవంత్‌తో సంబంధంలేదని ఎందుకు చెప్పరు?
చంద్రబాబును ప్రశ్నించిన కడియం
తొర్రూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలోని తొర్రూరులో ఆది వారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు రాష్ర్ట ఏర్పాటును అడ్డుకొని.. నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ వ్యవహారంలో చంద్రబాబు పాలుపంచుకుని రికార్డులతో పట్టుబడిన తర్వాత కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్ టా్యిపింగ్ చేసిందని గగ్గొలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్వతంత్ర ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబునాయుడు ఫోన్ సంభాషణలు మాత్రమే రికార్డు అయ్యాయి తప్ప ఆయన ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదన్నారు.