
'ఎన్ని డ్రామాలాడినా తప్పించుకోలేరు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు , రికార్డింగ్ కు తేడా తెలియని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయినా తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్పిందేనన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఎన్ని డ్రామాలాడినా కేసును పక్కదాని పట్టింలేరని, కేసు నుంచి తప్పించుకోలేరని ఆయన తెలిపారు.