డబ్బు రాజకీయం కుప్పకూలేను | politics are totally corrupted | Sakshi
Sakshi News home page

డబ్బు రాజకీయం కుప్పకూలేను

Published Fri, Jun 26 2015 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

డబ్బు రాజకీయం కుప్పకూలేను

డబ్బు రాజకీయం కుప్పకూలేను

దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమైన ‘ఓటుకు కోట్లు’ అంశాన్ని అనే కులు అనేక విధాలుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయాలన్నీ అవినీతిమయమై పోయాయని, ప్రతిపార్టీ ఇదే విధంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసింది పెద్ద తప్పేమీ కాదనే వారు కొందరయితే, బాబు గారి మాటలు రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకుని ఉం డాల్సిందని ఇంకొందరు బాహాటంగానే అంటున్నారు. ఇంకొందరు ఏది ఏమైనా ఖరీదైన రాజకీయాలు నడప డంలో బాబును అధిగమిం చేవారేలేరని, రేవంత్‌రెడ్డి అభినవ అర్జునుడని కూడా నిస్సిగ్గుగా కీర్తిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను చూసి నిశ్చేష్టులైన వారు రాజకీయాల పట్ల తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దొరికిన వారికైనా చట్టప్రకారం శిక్ష పడాలని మరికొందరు భావిస్తు న్నారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష ఎన్నికల రాజ కీయాల్లో ఉన్న నేనూ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగి పోతుండటం పట్ల వ్యక్తిగతంగా ఎంతో ఆవేదన చెందు తున్నాను, నాకూ తీవ్ర నిరసన ఉంది. ఎవరు ఎలా భావించినా నేనిది నిజాయితీగా చెబుతున్నా.
 
  ప్రస్తుత సమాజ నైజంలో, రాజకీయాల్లో మార్పు రావాలని కోరు కునే వాళ్లలో నేనూ ఒకడిని. నాకూ, మా పార్టీకి టీడీపీ జాతీయ నేత చంద్రబాబు నాయుడు శత్రువు కాదు,  రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. అలా అని భలే దొరికాడని శత్రుపూరితంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం వివేకం కాదనే నా భావన. కోట్లు పెట్టి టీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే స్టీఫెన్సన్‌ను కొనుగోలు చేయడం నేరమని చంద్రబా బుకు స్పష్టంగా తెలుసు. రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాక నేరం గుట్టురట్టయిందనీ తెలుసు. తన ఆడియో బయటపడ్డాక   మొత్తం తతంగమంతా రికా ర్డయి ఉందనీ బాబుకు ఎరుకే. దొరక్కముందు ఎవరైనా దొరలే, నీతిమంతులే. కానీ దొరికిన తర్వాత కూడా బుకాయిస్తే అసహ్యించుకుంటా రు, ఆగ్రహిస్తారు. రేవంత్ దొరి కిన వెంటనే బాబు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది. పోనీ బాబు ఆడియో బయటప డ్డాకైనా కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానంటే బావుండేదని నేను బలంగా భావిస్తున్నా. ఆ రెండూ చేయకుండా, నేరాన్ని ఖండించకుండా, ఆడియోలోని గొంతు తనదో కాదో చెప్పకుండా నేరాన్ని కప్పి పుచ్చేందుకు ఆయన చేస్తున్న లెక్కలేనన్ని తప్పులు  చంద్రబాబు రాజకీయ చరిత్రకే మచ్చ అని చెప్పక తప్పదు.  
 
 ఈ నేర చర్యను రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమ స్యగా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరిం చాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చారిత్రక ద్రోహం. కుట్ర రాజకీయాలకు పెట్టింది పేరైన బాబు ఈ కేసును పక్కతోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను మరో కొత్త కుట్రని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ ఓటుకు కోట్లు కుంభకోణంతో ఇక ఏపీ పేద రాష్ట్రమంటే ఎవరూ నమ్మకపోవచ్చు. ఓటుకు కోట్లు కుమ్మరించే రాష్ట్రంగా భావించి సానుభూతి చూపాలని, సహాయం చేయాలని అనుకోకపోవచ్చు. ఈ కేసు వల్ల మన రాష్ట్ర గౌరవానికి భంగం కలగడమే కాదు, ఆర్థికవృ ద్ధికే విఘాతం కలిగే ప్రమాదం దాపురించింది. అవినీతి కేసులో ఇరుక్కున్న ఒక సీఎంను నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశాలు ముందుకు వస్తాయి?
 
 టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును గద్దెదిం చడం దగ్గర నుంచే చంద్రబాబు ఆర్థిక నేరాలు తీవ్రతర మయ్యాయి. కాకపోతే ఇంతకాలానికి ఆయన అసలు ముఖం బయటపడింది. ఆయన గత తొమ్మిదేళ్ల పాల నకు ‘చంద్రబాబు జమానా - అవినీతి ఖజానా’గా ప్రసిద్ధి చెం దింది.  తర్వాత పదేళ్లు ప్రతిపక్షం లో ఉండగా సహాయపడ్డ పెట్టు బడిదారుల రుణాన్ని అధికారం లోకి రాగానే తీర్చుకోవడానికి వారికి  రాజ్యసభ సభ్యత్వాలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులూ కట్టబెట్టారు. వారి సహాయంతో పెద్ద ఎత్తున ‘అవినీతి మిషన్’ను బాబు నేడు ప్రారంభించారు.
 
 కేవలం డబ్బుతో రాజకీయాలను శాసించవచ్చని నమ్ముతున్న బాబు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశాలాంటి తెలుగు వారు అధికంగా ఉండే రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి డబ్బు సంపాదన ఒక్కటే మార్గమని  నమ్మినట్లున్నారు. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత టీడీపీ ఓడిపోతే పార్టీని నడుపు కోవడానికి ఇప్పుడే డబ్బు సమకూర్చుకోవాలని, డబ్బుంటేనే చిన్న బాస్ మాట చెల్లుబాటు అవుతుందని ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టుంది. తదనుగుణం గానే ఈ ఏడాది పాలనలో విచ్చలవిడి అవినీతికి తెరలే పారు. పైకి నీతులు వల్లిస్తూనే రాజధాని ఎంపిక రహ స్యం, నిర్మాణ నిర్ణయం రహస్యం, సింగపూర్ ఒప్పం దాల రహస్యం, చివరకు పట్టిసీమ నిర్ణయ రహస్యం, అన్నీ ముందే రహస్య ఒప్పందాలు, బేరాలు కుదిరాకే ప్రకటించారు. ప్రతిపక్షాలను, ఇతర రాజకీయ పక్షాలను లెక్కచేయని నియంతగా మారారు.
 
 సిమెంట్ ధరల పెంపు, అధిక ధరలకు విద్యుత్, బొగ్గు కొనుగోళ్లు, మద్యం డిస్టిలరీలకు అనుమతులు, పరిశ్రమలకు రాయి తీల విడుదల, పట్టిసీమ టెండర్ల వ్యవహారం, రాజధాని ప్రాంతంలో 99 ఏళ్ల భూముల లీజుల వ్యవహారాలు ఇలాంటి అనేక నిర్ణయాల్లో వేల కోట్ల రూపాయల అవి నీతి జరుగుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడా నికి ఓటుకు కోట్లు వెదజల్లుతున్న నారావారికి చివరగా ఒక్కమాట. రాజకీయాలతో డబ్బును శాసించవచ్చేమో కానీ, కేవలం డబ్బుతోనే రాజకీయాలను శాసించలేమని   గుర్తించాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రజా అనుకూల విధానాలతోనే, ప్రజల మద్దతుతోనే ప్రజాస్వామిక రాజ కీయాలు నడుస్తాయి. డబ్బుతో మాత్రమే రాజకీయాలు చేస్తే ఏదో ఒక రోజు పేక మేడలా వారి వ్యవహారాలు కూలిపోతాయి. టీడీపీలో ఎంతో మంది సీనియర్ నాయ కులు, నిజాయితీ పరులున్నా ఏ ఒక్కరూ ఈ కేసులో తమ అధినేత నైతిక బాధ్యత వహించాలని  బహిరంగం గా చెప్పకపోవడం బాధాకరం. పైగా ఆయనను వెన కేసుకు రావడం ఆ పార్టీ చరిత్రకే మాయని మచ్చ.
 
 ఓటుకు కోట్లు కేసును పక్కతోవ పట్టించే విధంగా ఫోన్ ట్యాపింగ్‌ను, సెక్షన్-8ని  ముందుకు తెచ్చి ప్రజల మధ్య భావోద్వేగాలను రగిల్చేందుకు ఇరు రాష్ట్ర ముఖ్య మంత్రులు చేస్తున్న ప్రయత్నం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు మౌనం పాటిస్తూ పరోక్షంగా నేర చర్యకు దన్నుగా నిలు స్తున్నారు. వెంకయ్యనాయుడు లాంటి వారు వివాదా లను పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడాలం టున్నారు.

ఇదంతా చూస్తుంటే బీజేపీ, టీడీపీ, టీఆర్ ఎస్‌లు ముగ్గురూ పరస్పర అవసరాలకు అనుగుణంగా గూడుపుఠానితో రాజీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమా నం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసును సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ చేత దర్యాప్తు చేయించా లనే డిమాండ్ సమంజసమైనది. దీనికితోడు నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించాల్సిందేననే విలువల పరిరక్షణకు తెలుగు సమాజం, మీడియా, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులు నిరంతరం ఉద్యమించాలి.
  (వ్యాసకర్త అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)
 మొబైల్: 82971 99999
 - డా॥ఎన్.రఘువీరారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement