‘ఓటుకు నోటు’ కేసులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలను ఏసీబీ బుధవారం అరెస్టు చేయనుంది. ఇప్పటిదాకా అణువణువు పరిశీలించి ఆధారాలను సమకూర్చుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన ఏసీబీ.. బుధవారం నుంచి కార్యాచరణకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు టీడీపీ నేతలను అరెస్టు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రే అరెస్టు వారంట్లు పొందినట్లు అత్యున్నత వర్గాల సమాచారం. అసలు ఈ ఇద్దరు నేతలను మంగళవారమే అదుపులోకి తీసుకుని విచారించాలని భావించినా.. న్యాయపరమైన అడ్డంకులు లేకుండా కోర్టు నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సూత్రధారి అయిన సీఎం నారా చంద్రబాబునాయుడుకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది.
Published Wed, Jun 17 2015 6:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement