
ఆయన గేమ్ ఆయనది.. మన ఆట మనది: లోకేశ్
‘ఆయన (కేసీఆర్) గేమ్ ఆయన ఆడతారు.. మన గేమ్ మనం ఆడతాం’ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: ‘ఆయన (కేసీఆర్) గేమ్ ఆయన ఆడతారు.. మన గేమ్ మనం ఆడతాం’ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు అందజేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు.
ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడారు. ‘చంద్రబాబు ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం గల్లీ రాజకీయాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.