ఓవైపు ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తుందన్న ప్రచారం, మరోవైపు కేబినెట్ సమావేశం...
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తుందన్న ప్రచారం, మరోవైపు కేబినెట్ సమావేశం... వెరసి సచివాలయంలో ఏపీ సీఎం ఉండే ఎల్ బ్లాక్‌లో భద్రతా తనిఖీలు తీవ్రం చేశారు. వాస్తవానికి ఉద్యోగులు గానీ, సందర్శకులు గానీ సచివాలయం మెయిన్‌గేట్ నుంచి లోపలి వస్తే ఏ బ్లాకులోని కార్యాలయానికైనా వెళ్లచ్చు. లోపలికి వచ్చాక ఎలాంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం ఉండదు.
కానీ బుధవారం ఎల్ బ్లాకు ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. ఎల్ బ్లాకులో 8వ అంతస్తులో సీఎం కార్యాలయం, ఏడో అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉంది. రెవెన్యూ, ఆరోగ్య, మునిసిపల్ తదితర శాఖలున్నాయి. అయినా గుర్తింపు కార్డు లేదా ప్రత్యేక పాసులుంటేనే లోనికి పంపారు. దీంతో సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.