
సీఎంతో స్టీఫెన్‌సన్ భేటీ
గంటల తరబడి మంతనాలు
కేసీఆర్‌తో కలసి ఫామ్‌హౌస్‌లో చక్కర్లు
గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారాన్ని బయటపెట్టిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయన.. గంటల తరబడి మంతనాలు జరిపారు. ‘ఓటుకు కోట్లు’ కేసు ఊపందుకున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం మధ్యాహ్నం సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఫాంహౌస్‌కు వచ్చారు.
పలు అంశాలపై సీఎం కేసీఆర్‌తో చర్చించి.. సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం కేసీఆర్‌తో స్టీఫెన్‌సన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసుపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా స్టీఫెన్‌సన్‌తో కలసి సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఫామ్‌హౌస్‌లో చక్కర్లు కొట్టారు. వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ సాగు పనులను పరిశీలిస్తూ.. మాట్లాడుకున్నారు. రాత్రి సమయంలో స్టీఫెన్‌సన్ వెళ్లిపోయారు. కాగా సీఎం కేసీఆర్ ఆదివారం వరకు ఫామ్‌హుస్‌లోనే ఉంటారని సమాచారం.