తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానని, ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యానని ఆయన తెలిపారు. ఇక విచారణకు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తానని ఆయన ఆ లేఖలో రాశారు. కాగా, ఓటుకు కోట్లు కేసులో నోటీసులు జారీ చేసినా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వెంకటవీరయ్యకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ సిద్ధమైందన్న సమాచారం అందడం వల్లే ఆయన ఇప్పుడు విచారణకు వస్తానని లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈసారీ స్పందించకపోతే ఆయన్ని నిందితుల జాబితాలోకి చేర్చాలని ఏసీబీ భావించడంతో ఇక తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని ఆయనకు సలహాలు ఇచ్చారు.