ఓటుకు కోట్లు కేసు పురోగతి దిశగా సాగుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు సండ్ర ఏసీబీ కార్యాలయానికి రావచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశముంది. టీడీపీకి చెందిన కీలక నేతలను ఏసీబీ విచారించవచ్చని భావిస్తున్నారు