
సండ్ర వెంకట వీరయ్య(ఫైల్)
తెలంగాణలో చంద్రబాబు ఎందుకుంటున్నారని ప్రశించే హక్కు కేసీఆర్ లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చిందే టీడీపీ ఆ పార్టీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చంద్రబాబు ఇక్కడ ఎందుకుంటున్నారని ప్రశించే హక్కు కేసీఆర్ లేదని అన్నారు. తెలంగాణలో ఉండే అన్ని హక్కులు టీడీపీకి ఉన్నాయని చెప్పారు. టీడీపీ తనకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా సోమవారం పరేడ్ మైదానం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో చంద్రబాబుపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కిరికిరి నాయుడు అని, తమ రాష్ట్రం వదిలి పొమ్మన్నా పోవడం లేదంటూ ధ్వజమెత్తారు.