'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు' | KP Vivekananda Slams TRS Leaders | Sakshi
Sakshi News home page

'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు'

Published Wed, Nov 26 2014 8:41 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు' - Sakshi

'మంత్రి పదవుల కోసమే రేవంత్ పై విమర్శలు'

హైదరాబాద్: మంత్రి పదవుల కోసమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేత రేవంత్రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకు పోటీ పడుతున్నారని కుత్భుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు ప్రెస్మీట్ పెట్టి పోటీపడ మరీ రేవంత్ ను తిడుతున్నారని వాపోయారు. డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై శాసనసభలో రేవంత్రెడ్డిని మాట్లాడనివ్వాలని కోరారు.

కాగా, రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖండించారు.టీడీపీని ఎదుర్కొనే సత్తా లేకే అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రేవంత్ మాట్లాడితే వాస్తవాలు బయటికి వస్తాయని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అన్నారు. అధికారపక్షమే పోడియంలోకి వచ్చి సభను వాయిదా వేయించిన ఘనత టీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement