హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇరుపక్షాల వాదనలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విన్నారు. దీనిపై మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కేసులో అయిదో నిందితుడిగా ఉన్న సండ్ర తన వాదనలు కోర్టుకు వినిపించారు. 'నా పిల్లలు విశాఖపట్నంలో చదువుకుంటున్నారు కాబట్టి మార్గమధ్యలో రాజమండ్రిలో చికిత్స పొందాను. నేను సత్తుపల్లి ఎమ్మెల్యేను కాబట్టి ఏసీబీ ...నా క్వార్టర్స్లో నోటీసు ఇచ్చిన విషయం తెలియదు. మీడియా ద్వారా విషయం తెలుసుకుని ఏసీబీకి లేఖ రాశాను. ఏసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఆ తర్వాత విచారణకు సిద్ధంగా ఉన్నానని రెండోసారి నేనే లేఖ రాశాను. రెండోసారి నోటీసులిచ్చిన సమయానికి విచారణకు హాజరయ్యాను. నిన్న 8 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ విచారణలో నాకు తెలిసిన అన్ని విషయాలు వెల్లడించా' అని తెలిపారు. ఎమ్మెల్యే సండ్రను నిన్న అరెస్ట్ చేసిన అధికారులు ఇవాళ ఏసీబీ కోర్టులు హాజరు పరిచారు. ఆయనను అయిదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తి, 1.30కి ఉత్తర్వులు
Published Tue, Jul 7 2015 1:09 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement