హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు టీడీపీ కార్యాలయానికి తెలంగాణ ఏసీబీ కానిస్టేబుళ్లు ఇద్దరు వెళ్లినట్లు సమాచారం. గత రాత్రి 8.30 గంటలకు కానిస్టేబుళ్లు ....బాబు ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఓటుకు కోట్లు కేసులో డ్రైవర్ కొండలరెడ్డిని విచారించేందుకు వెళ్లినట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కానిస్టేబుళ్లను ఇంట్లోకి అనుమతించడంపై నివాస భద్రతా అధికారి క్లాస్ పీకినట్లు సమాచారం.
అయితే కొండలరెడ్డి అక్కడ లేకపోవటంతో ...కానిస్టేబుళ్లు...టీడీపీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణకు హాజరు కావాలని సమాచారం అందించినట్లు సమచారం. చంద్రబాబు తనయుడు లోకేష్కు కొండలరెడ్డి డ్రైవర్గా వ్యవహరిస్తున్నాడు. ఇవాళ కొండలరెడ్డిని ఏసీబీ విచారించే అవకాశం ఉంది.
కాగా ఓటుకు కోట్లు కేసులో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఏసీబీ... సాంకేతిక అడ్డంకులు తొలగిపోవడం, కీలకమైన సమాచారం లభించటంతో దర్యాప్తును వేగవంతం చేయనుంది. గతనెల టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు నోటీసులు జారీచేసిన తెలుగు యువత రాష్ట్రనాయకుడు జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో జిమ్మిబాబు పాత్ర కీలకం కావటంతో ఆయనను పట్టుకోవడానికి ఏసీబీ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. త్వరలోనే జిమ్మిబాబును అరెస్ట్ చేసి...కేసులోని ఆర్థికమూలాలపై ప్రశ్నించే అవకాశం ఉంది.
చంద్రబాబు నివాసానికి ఏసీబీ కానిస్టేబుళ్లు
Published Wed, Aug 12 2015 10:35 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement