డీజీపీ, సీఎస్ లతో చంద్రబాబు మంతనాలు | chandra babu meets DGP and CS | Sakshi
Sakshi News home page

డీజీపీ, సీఎస్ లతో చంద్రబాబు మంతనాలు

Published Thu, Jun 25 2015 10:50 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

డీజీపీ, సీఎస్ లతో చంద్రబాబు మంతనాలు - Sakshi

డీజీపీ, సీఎస్ లతో చంద్రబాబు మంతనాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం మరోసారి డీజీపీ రాముడుతో భేటీ అయ్యారు. డీజీపీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశం అయిన ఆయన...ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నోటీసులు జారీ చేస్తే తదుపరి పరిణామాలపై చంద్రబాబు ఈ సందర్భంగా వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

కాగా ఓటుకు కోట్లు వ్యవహారానికి సూత్రధారి చంద్రబాబు నాయుడేనని తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దాంతో  ఈ నివేదికను ప్రత్యేక కోర్టునుంచి ఏసీబీ అధికారులు నేడు అధికారికంగా తీసుకోనుంది. ఆ నివేదిక అందిన మరుక్షణమే ఏసీబీ రంగంలోకి దిగి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు... డీజీపీతో పాటు, సీఎస్తో మంతనాలు జరిపారు. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి బయల్దేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement